డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీ, మోరిస్ సిక్సర్ల మోత... రాజస్థాన్‌కి ఉత్కంఠ విజయం...

Published : Apr 15, 2021, 11:25 PM IST

IPL 2021 సీజన్‌లో మరో లో స్కోరింగ్ మ్యాచ్‌లో క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. గత మ్యాచ్‌లో ఆఖరి బంతికి సంజూ శాంసన్ తనకి స్ట్రైయింగ్ ఇవ్వకుండా అవమానించాడనే కోపమో, ఏమో కానీ, కీలక సమయంలో 4 సిక్సర్లు బాదిన క్రిస్ మోరిస్... రాజస్థాన్ రాయల్స్‌కి తొలి విజయాన్ని అందించాడు. 

PREV
110
డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీ, మోరిస్ సిక్సర్ల మోత... రాజస్థాన్‌కి ఉత్కంఠ విజయం...

148 పరుగుల లక్ష్యచేధనతో బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్ రాయల్స్‌కి మూడో ఓవర్‌లోనే షాక్ తగిలింది. వరుసగా రెండు ఫోర్లు బాదిన మానన్ వోహ్రా, రబాడాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

210

క్రిస్ వోక్స్ వేసిన అదే ఓవర్‌లో జోస్ బట్లర్ కూడా రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 13 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్..

310

తొలి మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ 4 పరుగులకే అవుట్ అయ్యాడు. రబాడా బౌలింగ్‌లో ధావన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు సంజూ శాంసన్...

410

శివమ్ దూబే 2 పరుగులు, రియాన్ పరాగ్ 2 పరుగులు చేసి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. 42 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది రాజస్థాన్ రాయల్స్...

510

రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్ కలిసి ఆరో వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 17 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన రాహుల్ తెవాటియా, రబాడా బౌలింగ్‌లో లలిత్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

610

ఆ తర్వాత 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 

710

వరుసగా రెండు సిక్సర్లు బాదిన డేవిడ్ మిల్లర్, మూడో బంతికి కూడా భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 104 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్...

810

జయ్‌దేవ్ ఉనద్కడ్ 11 పరుగులు చేయగా రబాడా వేసిన 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో 15 పరుగులు రాబట్టిన క్రిస్ మోరిస్... ఆఖరి ఓవర్‌లో విజయానికి 12 పరుగులు కావాల్సిన స్థితి చేర్చాడు. 

910

టామ్ కుర్రాన్ వేసిన 20వ ఓవర్ మొదటి 2 పరుగులు రాగా, రెండో బంతికి సిక్సర్ బాదాడు మోరిస్..

1010

విజయానికి ఆఖరి నాలుగో బంతుల్లో 4 పరుగులు కావాల్సిన దశలో నాలుగో బంతికి సిక్సర్ బాది, రాజస్థాన్ రాయల్స్‌కి 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు క్రిస్ మోరిస్..

click me!

Recommended Stories