భారత క్రికెట్ బోర్డుకీ, టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ మధ్య వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ తీసుకున్న నిర్ణయం, మూడు ఫార్మాట్లలో అతను మాజీ సారథిగా మారడానికి కారణమైంది...
మొహాలీ వేదికగా ఇండియా, శ్రీలంక మధ్య జరగబోయే టెస్టు, విరాట్ కోహ్లీ కెరీర్‌లో నూరో టెస్టు. ఈ మైలురాయి మ్యాచ్‌లో కూడా విరాట్‌కి కనీస గౌరవం దక్కడం లేదు...
212
మొహాలీలో మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులను అనుమతించేది లేదంటూ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించడంతో, విరాట్ కోహ్లీ నూరో టెస్టు ఖాళీ స్టేడియంలో జరగనుంది...
312
పంజాబ్‌లో ప్రస్తుతం కరోనా కేసులు పెద్దగా నమోదవ్వడం లేదు. ధర్మశాలలో జరిగిన టీ20 మ్యాచులను వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతించింది బీసీసీఐ... బెంగళూరు డే నైట్ టెస్టు మ్యాచ్ చూసేందుకు కూడా ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించారు.
412
అక్కడ జనాలు స్టేడియంలోకి రావడానికి లేని అడ్డంకి, విరాట్ కోహ్లీ వందో టెస్టుకి మాత్రం ఎందుకనే అనుమానిస్తున్నారు విరాట్ కోహ్లీ అభిమానులు...
512
మొహాలీ టెస్టుకి ప్రేక్షకులను అనుమతించాలని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ భావించిందని, అయితే బీసీసీఐ, ఖాళీ స్టేడియంలో మ్యాచ్ నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి...
612
వాస్తవానికి బెంగళూరు వేదికగా మొదటి టెస్టు జరగాల్సింది. అయితే బీసీసీఐ, షెడ్యూల్‌లో మార్పులు చేసి తొలి టెస్టును మొహాలీకి, రెండో టెస్టుని బెంగళూరుకి మార్చింది...
712
ఇప్పుడు మొహాలీలో ప్రేక్షకులను అనుమతించక పోవడంపై విరాట్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు...
812
భారత జట్టుకి 40 టెస్టు విజయాలు అందించిన లెజెండరీ కెప్టెన్‌కి కాసింత గౌరవం ఇవ్వడం బీసీసీఐ కనీస బాధ్యత అని, మొహాలీ టెస్టుకు ప్రేక్షకులను అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు...
912
మరో మూడు రోజుల్లో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఒకవేళ బీసీసీఐ, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్.. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంటే... అది వెంటనే జరగాలి...
1012
మ్యాచ్ సమయం దగ్గర పడితే ఇంత తక్కువ టైంలో టికెట్లను విక్రయించడం, ప్రేక్షకుల కోసం ఏర్పాట్లు చేయడం వీలుకాదని పీసీఏ, బీసీసీఐ చెప్పొచ్చు...
మొహాలీలో టీమిండియా బస చేస్తున్న హోటల్ దగ్గర్నుంచి, స్టేడియం వరకూ వేల సంఖ్యలో అభిమానులతో ర్యాలీ నిర్వహించి... విరాట్‌కి 100వ టెస్టు గుర్తుండిపోయేలా చేయాలని చూస్తున్నారట...