IPL 2021: పంజాబ్ కింగ్స్ మరో ఫెయిల్యూర్... కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ముందు ఈజీ టార్గెట్...

First Published Apr 26, 2021, 9:22 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో మరోసారి పంజాబ్ కింగ్స్ జట్టు తీవ్రంగా తడబడింది. నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో మొదటి మ్యాచ్‌లో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగుల స్కోరు మాత్రమే చేయగలింది. ఒకానొకదశలో 100 పరుగులైనా చేస్తుందని అనిపించా జోర్డాన్ మెరుపులతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది పంజాబ్ కింగ్స్.

టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్... ఆరంభం నుంచి పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది. కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ 5.3 ఓవర్లలో 36 పరుగులు జోడించారు...
undefined
20 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి సునీల్ నరైన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
undefined
శివమ్ మావి బౌలింగ్‌లో క్రిస్‌గేల్ డకౌట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూకి వెళ్లిన దినేశ్ కార్తీక్, కేకేఆర్‌కి అనుకూలింగా రిజల్ట్ రాబట్టాడు. 2017లో ఉమేశ్ యాదవ్ తర్వాత క్రిస్‌గేల్‌ను గోల్డెన్ డక్ చేసిన బౌలర్‌గా నిలిచాడు శివమ్ మావి.
undefined
4 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసిన దీపక్ హుడాను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేయగా 34 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్‌ను సునీల్ నరైన్ అవుట్ చేశాడు..
undefined
19 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన నికోలస్ పూరన్‌ను వరుణ్ చక్రవర్తి క్లీన్‌బౌల్డ్ చేయగా హెండ్రిక్స్ 2 పరుగులు చేసి సునీల్ నరైన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు...
undefined
14 బంతుల్లో ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసిన షారుక్ ఖాన్, ప్రసిద్ధ్ బౌలింగ్‌లో అవుట్ కాగా రవి బిష్ణోయ్‌ను కమ్మిన్స్ పెవిలియన్ చేర్చాడు...
undefined
98 పరుగులకే 8 వికెట్లు కోల్పయిన దశలో 18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 30 పరుగులు చేసిన క్రిస్ జోర్డాన్, స్కోరు బోర్డును 120 పరుగులు దాటించాడు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో జోర్డాన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
undefined
click me!