నెదర్లాండ్స్‌పైన కూడా ఆడలేని రాహుల్‌కి వైస్ కెప్టెన్సీయా... పృథ్వీ షా చాలా బెటర్ అంటూ...

First Published | Oct 27, 2022, 2:52 PM IST

టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడనే క్రికెట్ విశ్లేషకులు అంచనా వేసిన ప్లేయర్ కెఎల్ రాహుల్. ఐపీఎల్ 2022 సీజన్‌లో 600+ పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఈసారి టీమిండియాకి ప్రధాన అస్త్రం అవుతాడని భావించారు. అయితే అలా జరగడం లేదు...

KL Rahul

పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 4 పరుగులు చేసి అవుటైన కెఎల్ రాహుల్, నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో కనీసం హాఫ్ సెంచరీ అయినా కొడతాడని అనుకున్నారు టీమిండియా ఫ్యాన్స్. అయితే అలా జరగలేదు...

12 బంతులు ఆడిన కెఎల్ రాహుల్, కేవలం 9 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ అవుట్‌గా ప్రకటించగానే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ల పక్కనుంచి వెళ్తున్నట్టు ఉందని, చేతులతో సైగ చేసి చెప్పినా, డీఆర్‌ఎస్ తీసుకోమని సూచించినా వినకుండా వెళ్లిపోయాడు కెఎల్ రాహుల్...


Image credit: PTI

టీవీ రిప్లైలో కెఎల్ రాహుల్ అవుటైన బంతి వికెట్లను మిస్ అవుతూ వెళ్తున్నట్టు కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. డీఆర్‌ఎస్ తీసుకుని ఉంటే కెఎల్ రాహుల్‌కి పసికూనలపై మంచి ఇన్నింగ్స్ నిర్మించే అవకాశం దక్కి ఉండేది...

Image credit: PTI

ఆసియా కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచుల్లోనూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరాడు కెఎల్ రాహుల్. శ్రీలంకతో మ్యాచ్‌లోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు..

Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాక్‌తో మ్యాచ్‌లోనూ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరిన కెఎల్ రాహుల్, ఆఖరికి నెదర్లాండ్స్‌పైన కూడా పరుగులు చేయలేకపోవడంతో సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ తెగ వైరల్ అవుతున్నాయి...
 

Prithvi Shaw

దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శన ఇస్తున్నా పృథ్వీ షాని సెలక్టర్లు పట్టించుకోవడం లేదు. ఫిట్‌నెస్ లేదనే వంకతో టీమిండియాకి ఎంపిక చేయడం లేదు. కెఎల్ రాహుల్‌ కంటే పృథ్వీ షాని టీమిండియాకి ఓపెనర్‌గా తీసుకొస్తే... సరిగ్గా రాణించగలడని అంటూ ‘Prithvi Shaw’ పేరును ట్రెండ్ చేస్తున్నారు...

అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2018 గెలిచిన పృథ్వీ షా, టీమిండియాకి తర్వాతి కెప్టెన్‌గా కూడా పనికి వస్తాడని... ఇటు కీలక మ్యాచుల్లో ఫెయిల్ అవుతూ, కెప్టెన్‌గానూ లోకల్ టీమ్ వెస్ట్రరన్ ఆస్ట్రేలియాతోనూ మ్యాచ్‌ని గెలిపించలేకపోయిన కెఎల్ రాహుల్‌ని కొన్నాళ్లు రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి, ఆ తర్వాత మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తే చాలని అంటున్నారు నెటిజన్లు...

ఆడిలైడ్ టెస్టులో రెండు టెస్టుల్లో ఫెయిల్ అయ్యాడని, పృథ్వీ షాని పూర్తిగా పట్టించుకోవడం మానేసిన సెలక్టర్లు... కెఎల్ రాహుల్ వరుసగా విఫలమవుతున్నా అవకాాశాలు ఇస్తుండడమే కాకుండా భావి కెప్టెన్‌గా చూడడం ఎంత వరకూ కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు... 

Latest Videos

click me!