మాదేం లేదు, అంతా వాళ్లు చెప్పినట్టే చేస్తాం... కెప్టెన్సీపై శిఖర్ ధావన్ కామెంట్...

First Published Jul 18, 2021, 5:19 PM IST

శ్రీలంక టూర్‌లో కెప్టెన్‌గా కొత్త అవతారం ఎత్తాడు భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్. 142 వన్డే మ్యాచులు ఆడిన తర్వాత కెప్టెన్‌గా మారిన శిఖర్ ధావన్, భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే (217 వన్డేలు), రోహిత్ శర్మ (171 వన్డేలు) తర్వాత కెప్టెన్సీ చేపట్టిన అత్యధిక అనుభవం కలిగిన ప్లేయర్‌గా నిలిచాడు...

‘గబ్బర్’శిఖర్ ధావన్ కెప్టెన్సీ ఎలా చేస్తాడోనని ఎదురుచూసిన క్రికెట్ ఫ్యాన్స్‌కి వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయి...
undefined
‘టీ20 వరల్డ్‌కప్‌కి జట్టును ఏర్పాటుచేయడమే లక్ష్యంగా ఈ సిరీస్ ఆడుతున్నాం. అందుకే ది బెస్ట్ ఎలెవన్‌ను ఆడించాలని అనుకుంటున్నాం...
undefined
ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలతో నేను మాట్లాడలేదు. అయితే రాహుల్ ద్రావిడ్‌తో వాళ్లు మాట్లాడే ఉంటారు. వాళ్లేవరి ఎంపిక చేయమని చెబితే, వాళ్లనే ఆడిస్తాం...
undefined
ఈ టూర్‌కి కొత్త ప్లేయర్లను ఎంపిక చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. అయితే వీళ్లల్లో ఎంత మందికి ఆడే అవకాశం వస్తుందో చెప్పలేం. ఇప్పుడు ప్రయోగాలు చేయడం కంటే సిరీస్ విజయమే టార్గెట్‌గా పెట్టుకున్నాం..’ అంటూ తెలిపాడు శిఖర్ ధావన్..
undefined
‘చాలామంది రవిశాస్త్రి కంటే రాహుల్ ద్రావిడ్ సీరియస్‌గా ఉంటాడని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. రవిభాయ్ చాలా గంభీరంగా ఉంటాడు... రాహుల్ చాలా కూల్...’ అంటూ కామెంట్ చేశాడు గబ్బర్.
undefined
డైరెక్టుగా చెప్పకపోయినా, తాను కేవలం పేపర్ కెప్టెన్‌ అన్నట్టుగా ఉన్నాయి శిఖర్ ధావన్ కామెంట్లు. ఏ ప్లేయర్‌ని ఎంపిక చేయాలి, ఎవరిని ఎంపిక చేయాలనేది ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న విరాట్ కోహ్లీ చేతుల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది...
undefined
కేవలం కమర్షియల్ విషయాలను, టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని, మెగా టోర్నీకి ముందు లిమిటెడ్ ఓవర్ స్పెషలిస్టులకు తగినంత ప్రాక్టీస్ కావాలని ఈ టూర్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది...
undefined
click me!