ముంబై ఇండియన్స్‌లో చేరిన పార్థివ్ పటేల్... రిటైర్మెంట్ తర్వాత ఆర్‌సీబీకి థ్యాంక్యూ చెబుతూ...

First Published Jan 22, 2021, 3:57 PM IST

దేశవాళీ క్రికెట్‌లో సంచలన ప్రదర్శనతో భారీ అంచనాలతో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు పార్థివ్ పటేల్. సచిన్ టెండూల్కర్ తర్వాత అతి పిన్న వయసులో టీమిండియాకి ప్రాతినిథ్యం వహించిన పార్థివ్, అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు.

దేశవాళీ క్రికెట్‌లో మాత్రం అద్భుతంగా రాణించిన పార్థివ్ పటేల్... ఆరంభం నుంచి 12 సీజన్ల పాటు బ్రేక్ లేకుండా ఆడిన ప్లేయర్లలో ఒకడు...
undefined
అయితే గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో సభ్యుడిగా ఉన్న పార్థివ్ పటేల్‌కి ఒక్క అవకాశం కూడా రాలేదు. యంగ్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ రాణించడమే దీనికి కారణం...
undefined
12 సీజన్ల పాటు బ్రేక్ లేకుండా ఐపీఎల్ ఆడిన పార్థివ్ పటేల్‌కి ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. అతని స్థానంలో యంగ్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్‌కి అవకాశమిచ్చాడు విరాట్ కోహ్లీ... పడిక్కల్ తన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకోవడంతో పార్థివ్ పటేల్‌కి ఒక్క ఛాన్స్ కూడా దక్కలేదు...
undefined
ఎప్పటిలాగే 2021 సీజన్‌కి ముందు 10 మంద ప్లేయర్లను మినీ వేలానికి విడుదల చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
undefined
ఆర్‌సీబీ రిలీజ్ చేసిన వారిలో ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన ఆరోన్ ఫించ్‌తో పాటు డేల్ స్టెయిన్, పార్థివ్ పటేల్ కూడా ఉన్నాడు...
undefined
రిటైర్మెంట్ తర్వాత తనను విడుదల చేయడంతో బాగా హార్ట్ అయిన పార్థివ్ పటేల్... ‘రిటైర్ అయిన తర్వాత రిలీజ్ చేయబడడం చాలా గర్వంగా ఉంది... థ్యాంక్యూ’ అంటూ ఆర్‌సీబీని ట్యాగ్ చేశాడు.
undefined
గత సీజన్‌లో తనకి అవకాశం ఇవ్వకుండా పక్కనబెట్టారనే కోపంతోనే పార్థివ్ పటేల్ ఇలా వ్యంగ్యంగా ట్వీట్ చేశాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు...
undefined
అయితే రిటైర్ అయిన ప్లేయర్లను కూడా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడం ఆనవాయితీ అని... ముంబై జట్టు మలింగను, సీఎస్‌కే జట్టు షేన్ వాట్సన్‌ను ఇలాగే విడుదల చేసిందని... పార్థివ్ పటేల్ మాత్రం ఇలా ఫీల్ అవ్వడంలో అర్థం లేదని అంటున్నారు విశ్లేషకులు.
undefined
ఇదిలా ఉంటే రిటైర్మెంట్ తర్వాత పార్థివ్ పటేల్... ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌లో చేరాడు... అయితే ప్లేయర్‌గా కాదు...
undefined
టాలెంట్ హంటర్‌ రోల్‌లో ముంబై ఇండియన్స్‌లో చేరిన పార్థివ్ పటేల్... దేశవాళీ, విదేశీ క్రికెట్‌లో సత్తా ఉన్న క్రికెటర్లను వెతికి పట్టుకుని వారిని ముంబై జట్టులో చేర్చే పనిలో పడ్డాడు..
undefined
click me!