లంకపై పాక్ విజయం, టీమిండియా ఫైనల్ ఛాన్సులను దెబ్బ తీస్తుందా... డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌లో...

Published : Jul 21, 2022, 03:08 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021 ఫైనల్‌లో ఓడి, టైటిల్ మిస్ చేసుకున్న భారత జట్టు, డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్‌ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది... శ్రీలంకపై తొలి టెస్టులో నెగ్గిన పాకిస్తాన్, మరోసారి భారత జట్టును వెనక్కినెట్టి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది...

PREV
110
లంకపై పాక్ విజయం, టీమిండియా ఫైనల్ ఛాన్సులను దెబ్బ తీస్తుందా... డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌లో...

ఆస్ట్రేలియా చేతుల్లో 0-1 తేడాతో టెస్టు సిరీస్ ఓడినా బంగ్లాదేశ్‌పై 0-2 తేడాతో సిరీస్ గెలిచిన పాకిస్తాన్, వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను 1-1 తేడాతో డ్రా చేసుకోగలిగింది. లంకతో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది... 

210

పాక్ ఇప్పుడు ఫైనల్ చేరాలంటే స్వదేశంలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లతో జరగబోయే టెస్టు సిరీస్ ఫలితాలే కీలకం కాబోతున్నాయి.. ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్‌ని ఓడిస్తే పాక్ ఫైనల్ చేరే అవకాశాలు పెరుగుతాయి...

310

సౌతాఫ్రికా ఈ సీజన్‌లో 7 టెస్టులు ఆడి 5 విజయాలు అందుకుని, రెండు పరాజయాలతో 71.43 విజయాల శాతంలో పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. అయితే సౌతాఫ్రికా ఫైనల్ చేరాలంటే రాబోయే మ్యాచుల్లో కీలక విజయాలను అందుకోవాల్సి ఉంటుంది...

410

వరుస విజయాలతో ఫైనల్ చేరడం పక్కా అనుకున్న ఆస్ట్రేలియాకి శ్రీలంక ఊహించని షాక్ ఇచ్చింది. లంక పర్యటనలో రెండో టెస్టులో ఓడిన ఆస్ట్రేలియా, ఈ సీజన్‌లో తొలి ఓటమిని చవిచూసి, పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది...
 

510

అయితే ఆస్ట్రేలియాకి ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచుల్లో పెద్దగా ఛాలెంజింగ్ సిరీస్‌ అంటే భారత పర్యటనే. స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు, సౌతాఫ్రికాతో మూడు టెస్టులు ఆడనుంది ఆస్ట్రేలియా...

610

యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ని 4-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా, స్వదేశంలో ఈ రెండు జట్లపై విజయాలు అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. టీమిండియాతో జరిగే నాలుగు మ్యాచుల్లో ఆస్ట్రేలియా ఎన్ని మ్యాచుల్లో గెలుస్తుందనేదానిపైనే ఆసీస్ ఫైనల్ ఛాన్సులు డిసైడ్ అవుతాయి...

710

ఇక భారత జట్టు ఫైనల్ చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచుల్లో తప్పక గెలవాల్సిందే. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు ఆడాల్సి ఉంది టీమిండియా. వీటిల్లో ఒక్క పరాజయం అందుకోకుండా వరుస విజయాలు అందుకుంటే 68 శాతం విజయాలతో ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది భారత జట్టు...

810

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో ఆఖరి వికెట్ తీయలేక మ్యాచ్‌ని డ్రా చేసుకుంది టీమిండియా. ఈ టెస్టు మ్యాచ్ గెలిచి ఉంటే భారత జట్టు ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉండేవి...

910

పాయింట్ల పట్టికలో కింద ఉన్న వెస్టిండీస్, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. ఫైనల్ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్టే. మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలిచినా ఈ జట్లు ఫైనల్ చేరే ఛాన్సులు చాలా తక్కువ...

1010

ప్రస్తుతం 16 టెస్టుల్లో 5 విజయాలు, 7 పరాజయాలు అందుకుని 4 టెస్టులు డ్రా చేసుకున్న ఇంగ్లాండ్ జట్టు, పాకిస్తాన్‌తో మూడు టెస్టులు, సౌతాఫ్రికాతో మూడు టెస్టులు, వెస్టిండీస్‌తో 2 మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇవన్నీ గెలిచినా ఇంగ్లాండ్ విజయాల శాతం 53 కూడా దాటదు... 

click me!

Recommended Stories