KL Rahul
పాల్ వాన్ మీకీరన్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌ని ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు ఫీల్డ్ అంపైర్. నాన్ స్ట్రైయికింగ్‌లో ఉన్న రోహిత్ శర్మ, బంతి సైడ్ నుంచి వెళ్తుందేమోనని అనుమానంతో డీఆర్‌ఎస్ తీసుకోమ్మని రాహుల్‌కి చెప్పాడు. అయితే రాహుల్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా పెవిలియన్ చేరాడు...
KL Rahul
టీవీ రిప్లైలో కెఎల్ రాహుల్ అవుటైన బాల్, వికెట్లను మిస్ అవుతూ వెళ్తున్నట్టు స్పష్టంగా కనిపించింది. కెఎల్ రాహుల్ డీఆర్‌ఎస్ తీసుకుని ఉంటే, అతను నాటౌట్‌గా తేలేవాడు. మరిన్ని పరుగులు చేసి, తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే అవకాశం అయినా దక్కేది...
‘కెఎల్ రాహుల్ అవుటైన విధానం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. డీఆర్‌ఎస్ తీసుకుని ఉంటే ఏమయ్యాది? ఒకవేళ అవుట్ అన తేలితే, ఓ రివ్యూ ఛాన్స్ పోయేదేమో. నాటౌట్ అని తేలితే... పరుగులు చేసేవాడుగా. టీమ్‌ని పటిష్టమైన పొజిషన్‌లో ఉంచే అవకాశం దక్కేదిగా...
Image credit: PTI
కానీ కెఎల్ రాహుల్ అలా చేయలేదు. అతను ఎందుకు రివ్యూ తీసుకోలేదో నాకైతే అర్థం కావడం లేదు. 2011లోనే నేను టీమ్‌లో ఓ రూల్ పెట్టాను. ఒకవేళ ఏ బాల్ అయినా నా ప్యాడ్స్‌ని తగిలి, అంపైర్ అవుట్‌గా ప్రకటిస్తే నేను వెంటనే రివ్యూ తీసుకుంటా...
ఉన్న రెండు రివ్యూల్లో ఒకటి నాకు, మిగిలినది టీమ్ కోసం అని ముందే చెప్పా... చాలాసార్లు ఇది నాకు ఉపయోగపడింది కూడా... టీమ్‌లో ఉన్న అందరూ నాకు సపోర్ట్ చేసేవాళ్లు. కెఎల్ రాహుల్‌కి అలాంటి సపోర్ట్ లేదా?
Virender Sehwag
మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు రివ్యూ తీసుకోవాలి. ఫామ్‌లో లేకపోతే రివ్యూ తీసుకునే ఛాన్స్‌ని అస్సలు మిస్ చేసుకోకూడదు. కెఎల్ రాహుల్ అసలే ఫామ్‌లో లేడు. రివ్యూ వేస్ట్ చేయడం ఎందుకని సైలెంట్‌గా వెళ్లిపోయి ఉంటాడు... ’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్..