వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్ ఆడుతోంది భారత జట్టు. మూడు వన్డేల సిరీస్‌లో రెండు వన్డేల్లోనూ భారత బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఇషాన్ కిషన్ వరుసగా రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలు చేసుకున్నా, భారీ స్కోరుగా మలచడంలో ఫెయిల్ అయ్యాడు...
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో మూడు వన్డేల్లోనూ గోల్డెన్ డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్‌ని, వన్డేల్లో ఇరికించాలని టీమిండియా చేస్తున్న ప్రయత్నం... అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..
28
37 టీ20 మ్యాచుల్లో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు బాది, నెం.1 టీ20 బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్, ఇప్పటిదాకా గత 17 వన్డే ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీ మార్కు కూడా అందుకోలేకపోయాడు. గత 7 వన్డేల్లో నాలుగు సార్లు డకౌట్ అయ్యాడు...
38
Suryakumar Yadav
అయిలే లిస్టు ఏ క్రికెట్‌లో సూర్యకుమార్ యాదవ్ రికార్డు బాగానే ఉంది. దేశవాళీ వన్డే టోర్నీల్లో 33.97 సగటుతో 3330 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, టీమిండియా తరుపున వన్డేల్లో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు..
48
Suryakumar Yadav
గత ఏడాది వన్డేల్లో 66 సగటుతో పరుగులు చేసిన సంజూ శాంసన్‌ని పక్కనబెట్టి, సూర్యకుమార్ యాదవ్‌కి వరుస అవకాశాలు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే సూర్యకు మరిన్ని అవకాశాలు ఇస్తామని అంటున్నాడు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...
58
‘సూర్యకుమార్ యాదవ్ సూపర్ టాలెంటెడ్ ప్లేయర్. అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు లేవు. అయితే టీ20ల్లో సంచలన ప్రదర్శన ఇస్తున్న సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో మాత్రం వరుసగా ఫెయిల్ అవుతున్నాడు...
68
Suryakumar Yadav
అయితే దేశవాళీ వైట్ బాల్ క్రికెట్‌లో సూర్యకుమార్ యాదవ్ చక్కగా రాణించాడు. టీ20లతో పోలిస్తే తన వన్డే గణాంకాలు సరిగా లేవని సూర్యకుమార్ యాదవ్ కూడా అంగీకరిస్తాడు. అయితే వన్డేల్లో ఎలా ఆడాలో సూర్యకుమార్ యాదవ్ నేర్చుకుంటున్నాడు...
78
ఐపీఎల్‌లో ఎన్నో మ్యాచులు ఆడి టీ20 క్రికెట్ ఎలా ఆడాలో తెలుసుకున్నాడు, నెం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు... వన్డేల్లో ఐపీఎల్ లేదు. కాబట్టి అంతర్జాతీయ మ్యాచుల్లోనే నేర్చుకోవాలి..
88
Image credit: PTI
వరుసగా ఫెయిల్ అవుతున్నా, అతనికి మరిన్ని అవకాశాలు ఇస్తాం. వాటిని ఎలా వాడుకుంటాడనేది అతని చేతుల్లోనే ఉంది. బాగా ఆడితే వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతాడు, లేదంటే వన్డేల్లో అతని చోటుకి గ్యారెంటీ లేదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్..