వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టాడని, టీ20ల్లో ఆడిస్తున్నారా... మరో ఆప్షన్ లేకనే ఇషాన్ కిషన్‌కి వరుస ఛాన్సులా...

First Published Jan 28, 2023, 1:58 PM IST

ఇషాన్ కిషన్... టాలెంట్‌లో కొదువేం లేదు. అయితే అసలు సమస్య నిలకడే. ఇషాన్ కిషన్ ఏ మ్యాచ్‌లో బాగా ఆడతాడో, ఏ మ్యాచ్‌లో ఫ్లాప్ అవుతాడో అతనికే తెలీదు. టీ20ల్లో అయితే ఇషాన్ కిషన్ ఫామ్ ఏ మాత్రం బాగోలేదు. గత 12 టీ20 ఇన్నింగ్స్‌ల్లో  ఇషాన్ కిషన్ ఒక్కసారి కూడా 40+ స్కోరు కూడా అందుకోలేకపోయాడు...

2022 సౌతాఫ్రికా సిరీస్‌లో 26 బంతుల్లో 27 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, రెండో టీ20లో 7 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఐర్లాండ్ టూర్‌లో తొలి టీ20లో 11 బంతుల్లో 26 పరుగులు చేసి అవుటైన ఇషాన్ కిషన్, రెండో మ్యాచ్‌లో 5 బంతులాడి 3 పరుగులకే పెవిలియన్ చేరాడు...

ఇంగ్లాండ్‌తో ఆడిన ఏకైక టీ20లో 10 బంతుల్లో 8 పరుగులు చేసి అవుటైన ఇషాన్ కిషన్, వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లో 11 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌ పర్యటనలో తొలి టీ20లో 31 బంతుల్లో 36 పరుగులు చేసిన ఇషాన్, రెండో టీ20లో 11 బంతుల్లో 10 పరుగులు చేశాడు...

Image credit: PTI

బంగ్లాదేశ్‌పై మూడో వన్డేలో డబుల్ సెంచరీ బాదిన తర్వాత శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 29 బంతుల్లో 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇషాన్ కిషన్. ఆ తర్వాత రెండో టీ20లో 2, మూడో టీ20లో 1 పరుగు చేసిన ఇషాన్ కిషన్, న్యూజిలాండ్‌తో తొలి టీ20లో 5 బంతుల్లో 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
 

ishan

ఇషాన్ కిషన్ వరుసగా ఫెయిల్ అవుతున్నా, అతనికి అవకాశాలు ఇస్తూ వస్తోంది టీమిండియా. కారణం రిషబ్ పంత్, సంజూ శాంసన్ అందుబాటులో లేకపోవడమే. రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురి కాగా సంజూ శాంసన్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు...

Ishan Kishan

టీ20 సిరీస్‌తో జితేశ్ శర్మను ఎంపిక చేసినా, కొత్త కుర్రాడిని ఆడించడం కంటే ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌ని ఆడించడంపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...

Image credit: PTI

టీ20ల్లో ఓపెనర్లు చాలా కీలకం. ఓపెనర్ వచ్చిన ప్లేయర్ కనీసం 100+ స్ట్రైయిక్ రేటుతో కూడా బ్యాటింగ్ చేయలేకపోతే ఆ జట్టు, 200+ స్కోరు చేయడం, 170+ టార్గెట్‌లను చేధించడం కష్టమైపోతుంది...

ఇప్పుడు టీమిండియా పరిస్థితి అదే. వన్డేల్లో డబుల్ సెంచరీ బాదాడని, టీ20ల్లో ఆడించడం కరెక్ట్ కాదు. ఆ ఫార్మాట్ వేరు, టీ20 ఫార్మాట్‌కి కావాల్సిన స్కిల్స్ వేరు. ఇషాన్‌లో టీ20 స్కిల్స్ ఉన్నా, అవి ఎప్పుడో కాని బయటికి రావు. కాబట్టి ఇషాన్ కిషన్‌కి వరుస అవకాశాలు ఇచ్చి, పరాజయాలు ఎదుర్కోవడం కంటే పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్ వంటి ప్లేయర్లను ట్రై చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.. 

click me!