ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌నే వణికిస్తున్నారు... ఇక మన పరిస్థితి ఏంటి?...

First Published Jun 11, 2021, 10:55 AM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌కి ఇంకా సరిగా వారం రోజులే సమయం ఉంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు సౌంతిప్టన్‌లో నెట్ ప్రాక్టీస్ మొదలెట్టింది. మరోవైపు టీమిండియా కంటే చాలాముందుగానే ఇంగ్లాండ్ చేరుకున్న న్యూజిలాండ్ ప్రస్తుతం ఆ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది...

మొదటి టెస్టులో ఇంగ్లాండ్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసిన న్యూజిలాండ్ బౌలర్లు, రెండో టెస్టులోనూ అదరగొడుతున్నాడు. తొలి రోజు మొదటిఇన్నింగ్స్‌లో వికెట్లేమీ కోల్పోకుండా 67 పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు, ఆ తర్వాత న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి వరుస వికెట్లు కోల్పోయింది...
undefined
మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు తీయగా, ఆజజ్ పటేల్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్ రెండు కీలక వికెట్లు తీయగా... నీల్ వాగ్నర్‌కి ఓ వికెట్ దక్కింది. 175 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లాండ్‌ను డానియల్ లారెన్స్, ఓల్లీ స్టోన్, రోరీ బర్న్స్ కలిసి ఆదుకున్నారు...
undefined
తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది ఇంగ్లాండ్. ఇది మరీ తక్కువ స్కోరు కాకపోయినా ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ఇంత తక్కువ స్కోరుకి పరిమితం చేయడం అంటే అది చిన్న విషయం కాదు...
undefined
డ్యూక్ బాల్స్‌తో ఆడిన అనుభవం ఉన్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లే న్యూజిలాండ్ పేస్ అటాక్ ముందు నిలవలేకపోతే, మరి మనవాళ్ల పరిస్థితి ఏంటని ఆలోచనలో పడ్డారు టీమిండియా ఫ్యాన్స్...
undefined
ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో వానలు కురుస్తుండడంతో అక్కడి పరిస్థితులు, న్యూజిలాంట్ పిచ్, వాతావరణ పరిస్థితులకు చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే స్వదేశంలో రాణించినట్టుగానే ఇంగ్లాండ్‌లోనూ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు న్యూజిలాండ్ బౌలర్లు...
undefined
భారత్‌పై భారత్‌లో డబుల్ సెంచరీ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, గత మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదుచేయలేకపోయాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, వికెట్ కీపర్ వాట్లింగ్ గాయం కారణంగా రెండో టెస్టుకి దూరంగా ఉన్నారు.
undefined
అయితే టీమిండియాతో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ సమయానికి ఈ ఇద్దరూ కోలుకుని, బరిలో దిగే అవకాశం ఉంది. వికెట్ కీపర్ వాట్లింగ్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలకబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు.
undefined
న్యూజిలాండ్ స్టార్ పేసర్లు టిమ్ సౌథీ, జిమ్మీసన్‌లకి రెండో టెస్టులో విశ్రాంతి కల్పించింది న్యూజిలాండ్ జట్టు. ఈ ఇద్దరూ లేకపోయినా న్యూజిలాండ్ పేస్ అటాక్, ఇంగ్లాండ్‌ను ఇబ్బంది పెడుతోందంటే వారి బౌలింగ్ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు...
undefined
టిమ్ సౌథీ, జిమ్మీసన్‌, ట్రెంట్ బౌల్ట్‌, నీల్ వాగ్నర్... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆడే అవకాశం ఉంది. వీరితో పాటు సర్‌ప్రైజ్ ప్యాక్‌గా స్పిన్నర్ మిచెల్ సాంట్నర్‌కి బదులుగా మ్యాట్ హెన్రీ వంటి మరో పేసర్‌ను ఆడించే అవకాశం కూడా ఉంది...
undefined
మనవాళ్లకి దొరికిన ఈ వారం రోజులను ఎంత పర్ఫెక్ట్‌గా వాడుకుంటారనేదానిపైనే ఫైనల్ మ్యాచ్ పర్ఫామెన్స్ ఆధారపడి ఉంది. లేదంటే ఇంగ్లాండ్‌లో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌నే ఇబ్బంది పెట్టిన కివీస్ బౌలర్లకు భారత బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
undefined
click me!