సూర్య కుమార్ యాదవ్: మోస్ట్ ఓవర్‌రేట్ ప్లేయర్.. భారత కెప్టెన్ కు ఏమైంది?

Published : Feb 01, 2025, 01:02 PM IST

suryakumar yadav: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టుకు అవసరమైన సమయంలో సహకారం అందించడంలో విఫలం కావడంతో అతని ఫామ్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.

PREV
15
సూర్య కుమార్ యాదవ్: మోస్ట్ ఓవర్‌రేట్ ప్లేయర్.. భారత కెప్టెన్ కు ఏమైంది?
Image Credit: Getty Images

ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో మరో మ్యాచ్ ఉండగానే సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలోని భారత జట్టు సిరీస్ ను కైవంస చేసుకుంది. జనవరి 31, శుక్రవారం పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగో T20Iలో భారత్ సూపర్ విక్టరీని అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో డకౌట్ కావడంతో టీమిండియా T20I కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవమైన ఫామ్ కొనసాగింది. 

25
Image Credit: Getty Images

వరుసగా వికెట్లు వదులకున్న భారత్ 

ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ చేతిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ ఓడిపోవడంతో భారత్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఆతిథ్య జట్టు ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లు టీమిండియాకు మంచి స్కోర్లు అందించాలని భావించారు.

అయితే, ఇంగ్లాండ్ బౌలర్ సకిబ్ మహూద్ తొలి ఇన్నింగ్స్ 2వ ఓవర్లో భారత్ బ్యాటింగ్ పతనానికి కారణమయ్యాడు. అతను సంజు శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0)ల వికెట్లను తీశాడు. ఒకే ఓవర్ లో భారత్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్‌ 2 ఓవర్లలో 12/3 పరుగులతో ఒత్తిడిలోకి జారుకుంది.

35
Image Credit: Getty Images

కెప్టెన్ ఇన్నింగ్స్ కావాల్సిన సమయంలో నిరాశపర్చిన సూర్య కుమార్ యాదవ్ 

వరుసగా ఇద్దరు ప్లేయర్లు ఔట్ అయిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. జట్టుకు అవసరమైన సమయంలో తన సహకారం అందించడంలో విఫలమవడంతో అతని ఫామ్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. భారత కెప్టెన్ అస్థిరమైన ప్రదర్శనలు కీలక సమయాల్లో ఒత్తిడిని ఎదుర్కోగల అతని సామర్థ్యంపై ప్రశ్నలను లేవనెత్తాయి.

భారత జట్టు 12/2 పరుగుల వద్ద ఉన్నప్పుడు సూర్యకుమార్ బ్యాటింగ్‌కు వచ్చాడు. టీమిండియా ఈ పరిస్థితి నుంచి మెరుగవుతుందని ఆశించారు. అయితే, టీమిండియా మేనేజ్‌మెంట్‌ను, అభిమానులను నిరాశపరిచిన సూర్యకుమార్ యాదవ్ క్రీజులో నాలుగు బంతులు మాత్రమే ఆడి పెవిలియన్ కు చేరాడు. ఇంగ్లండ్‌కు భారత కెప్టెన్ ఈజీ వికెట్ ఇవ్వడంతో స్టేడియం మొత్తం నిశబ్దంగా మారింది.

45

సూర్య కుమార్ యాదవ్ పై విమర్శలు 

భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఔట్ అయిన తర్వాత టీమిండియా క్రికెట్ అభిమానులు  సోషల్ మీడియా వేదికాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. 

ప్రస్తుతం జరుగుతున్న T20I సిరీస్‌లో అతని పేలవమైన ప్రదర్శన క్రమంలో భారత T20I కెప్టెన్‌ సూర్యను టార్గెట్ చేసి తిట్టడం ప్రారంభించారు. మాజీ క్రికెటర్ల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే, ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగే చివరి మ్యాచ్ లో అయిన తన టీ20 మార్క్ ను చూపించాలని ఆశిస్తున్నారు.

55

ఇంగ్లాండ్ పై భారత్ సిరీస్ గెలవడంపై సూర్య కుమార్ యాదవ్ ఏమన్నారంటే? 

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసి ఈ సిరీస్‌లో 3-1తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. దీని తర్వాత భారత కెప్టెన్ సూర్య మాట్లాడుతూ, 'ప్రతి ఆటగాడు అద్భుతమైన ప్రయత్నాలు చేశారు. అభిమానులు ఎప్పుడూ మాకు మద్దతుగా నిలిచారు. ఒక ఓవర్‌లో 3 వికెట్లు కోల్పోవడం చాలా దారుణం. హార్దిక్, శివమ్ తమ అనుభవాన్ని చూపించిన విధానం నిజంగా అద్భుతం. మనం సరైన దిశలో పయనిస్తున్నామని నేను భావిస్తున్నానని' చెప్పాడు.

అలాగే, 'పవర్‌ప్లే తర్వాత 7 నుండి 10 ఓవర్ల మధ్య మేము ఆటను నియంత్రించగల సమయం అని నాకు తెలుసు.. అదే జరిగింది. కొన్ని వికెట్లు తీసి ఆటను నియంత్రించాం. డ్రింక్స్ తర్వాత, దురదృష్టవశాత్తు శివమ్ దూబే ఫీల్డ్‌కి తిరిగి రాలేకపోయాడు. హర్షిత్ రానా మూడో పేసర్‌గా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి మాకు మంచి ప్రదర్శన ఇచ్చాడు. నిజంగా అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో హర్షిత్ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 ముఖ్యమైన వికెట్లు పడగొట్టాడు.

Read more Photos on
click me!

Recommended Stories