ఆ విషయంలో కోహ్లీదే తప్పు.. అందుకే నేను నవీన్‌కు సపోర్ట్ చేశా : గంభీర్ సంచలన వ్యాఖ్యలు

Published : Jun 12, 2023, 06:34 PM IST

ఐపీఎల్ -16 లో ఆట కంటే ఎక్కువ ఫేమస్ అయింది కోహ్లీ వర్సెస్ నవీన్ ఉల్ హక్ వివాదం.  కోహ్లీ - నవీన్ లు  మాటా మాటా అనుకోవడంతో ఈ వివాదం  రచ్చకెక్కింది. 

PREV
16
ఆ విషయంలో కోహ్లీదే  తప్పు.. అందుకే నేను  నవీన్‌కు  సపోర్ట్ చేశా :  గంభీర్ సంచలన వ్యాఖ్యలు

కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఐపీఎల్- 16 లో భాగంగా మే 1న జరిగిన  లక్నో సూపర్ జెయింట్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్  లో ఆర్సీబీ   స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, లక్నో బౌలర్  నవీన్ ఉల్ హక్ మధ్య  వాగ్వాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.  

26

కోహ్లీ.. నవీన్ ను స్లెడ్జ్ చేయడం దానికి లక్నో బౌలర్ కూడా ధీటుగా స్పందించడం..  మ్యాచ్ ముగిశాక కోహ్లీతో నవీన్  చేతులు కలపడానికి  ఇష్టపడకపోవడంతో పాటు  కెఎల్ రాహుల్ పిలిచినా అందుకు నిరాకరించడం..  గౌతం గంభీర్ కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకోవడంతో నానా రచ్చ  జరిగింది.  

36

అయితే ఈ వివాదంలో గంభీర్.. కోహ్లీతో వాగ్వాదానికి దిగడమే గాక నవీన్ ను సమర్థించడం చాలా మంది భారత అభిమానులకు నచ్చలేదు.  ఎంత గొడవలున్నా స్వదేశానికి చెందిన ఆటగాడిని   వ్యతిరేకిస్తూ  ఇతర దేశపు ఆటగాడిని సపోర్ట్ చేయమేంటని గంభీర్ పై విమర్శలతో పాటు సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తాయి.  

46

ఇదే విషయమై గంభీర్ తాజాగా స్పందించాడు.  ‘ఆ వివాదంలో కోహ్లీదే తప్పు. నవీన్ ఉల్ హక్ చేసిందే రైట్.  అందుకే నేను అతడిని సపోర్ట్ చేశా. అక్కడ నవీన్ ఉన్నాడని కాదు. ఆఖరికి కోహ్లీ ఉన్నా నేను అతడికే సపోర్ట్ చేసేవాడిని.  నేనెప్పుడూ నిజంవైపే నిల్చుంటా.  నా చివరి శ్వాస వరకూ ఇదే ఫాలో అవుతా..’అని  క్లారిటీ ఇచ్చాడు. 

56
gambhir dhoni

కాగా  కోహ్లీ, ధోనీలతో తనకు వ్యక్తిగత  విభేదాలేమీ లేవని  గంభీర్ స్పష్టం చేశాడు.  కోహ్లీ భారత్ కు చేసిన సేవలను  అతడు కొనియాడాడు.  ‘కోహ్లీ టీమిండియాకు చాలా చేశాడు. చాలా మంది నన్ను  మీకు కోహ్లీ, ధోనీలతో రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందని అడుగుతారు..?  వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.. కోహ్లీ, ధోనీలతో నా రిలేషన్‌షిప్ ఒకేవిధంగా ఉంటుంది. ఆన్ ది ఫీల్డ్ లో ఏం జరిగినా  ఆఫ్ ది ఫీల్డ్ లో మాత్రం నాకు ఇద్దరితోనూ సత్సంబంధాలే ఉన్నాయి...’అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  

66

ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత్ ఓడటంపై గంభీర్ స్పందిస్తూ.. ‘మనదేశంలో టీమిండియాని ఓ టీమ్‌గా చూడము. వ్యక్తిగత ప్లేయర్లుగా చూస్తాం. టీమ్‌లో విరాట్ కోహ్లీ ఓ స్టార్, రోహిత్ శర్మ ఓ స్టార్. టీమ్ కంటే వీళ్లకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుంది. టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి దేశాలు కానీ వ్యక్తులను కాకుండా టీమ్‌కి ప్రాధాన్యం ఇస్తాయి. ఇదే వాళ్ల సక్సెస్‌కి కారణం. భారత్ లో వ్యక్తులను కాకుండా టీమ్ కు క్రెడిట్ దక్కితేనే వరల్డ్ కప్ ట్రోఫీలు దక్కుతాయి..’అని కామెంట్ చేశాడు. 

Read more Photos on
click me!

Recommended Stories