కెప్టెన్సీపై కేఎల్ రాహుల్ ఇంకా ఏం చెప్పారంటే?
కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో పలు టీమ్స్ కు ఆడాడు. అయితే, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కు కెప్టెన్ గా మూడు సీజన్లు జట్టును ముందుకు నడిపించాడు. "నాకు కెప్టెన్సీ కావాలని నేను ఎవరికీ చెప్పను. నా నాయకత్వ పటిమ చాలా బాగుందని మీరు అనుకుంటే.. గత నాలుగు-ఐదేళ్లలో నేను నా జట్టును హ్యాండిల్ చేసిన విధానం.. .నేను ఉంటే అది విలువైనదిగా గుర్తిస్తే.. అప్పుడు నేను కెప్టెన్సీ చేయాలని మీరు అప్పగిస్తే సంతోషంగా ముందుకు సాగుతానని'' చెప్పాడు.
IPL గెలవాలనే అంతిమ లక్ష్యం కోసం కలిసి పనిచేసే సానుకూల, సహాయక వాతావరణం ఉన్న జట్టులో భాగంగా ఉండాలనేది తన కోరికగా పేర్కొన్నాడు. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ లో కేఎల్ రాహుల్ పట్ల లక్నో సూపర్ జెయింట్స్ యజమాని గోయేంకా ప్రవర్తించిన తీరు క్రీడా వర్గాలను విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే. అందుకే అతను లక్నో టీమ్ లో భాగం కాలేదని రిపోర్టులు పేర్కొంటున్నాయి.