ధోనీకి షాక్ ఇచ్చిన బీసీసీఐ... మాహీ అయినా సరే, ఫారిన్ లీగుల్లో ఆడితే తెగతెంపులేనంటూ హెచ్చరిక...

Published : Aug 13, 2022, 10:52 AM IST

టీమిండియాకి కెప్టెన్‌గా మూడు టైటిల్స్ అందించిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. బీసీసీఐ నుంచి క్లియరెన్స్ తెచ్చుకుని, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొందామనుకున్న మాహీకి అనుమతి ఇచ్చేది లేదంటూ స్పష్టం చేసింది...

PREV
16
ధోనీకి షాక్ ఇచ్చిన బీసీసీఐ... మాహీ అయినా సరే, ఫారిన్ లీగుల్లో ఆడితే తెగతెంపులేనంటూ హెచ్చరిక...

ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జోహన్‌బర్గ్ ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. సీఎస్‌కేలో వాటాలు ఉన్న మాహీ కూడా ఈ టీ20 లీగ్‌లో పాల్గొనాలని భావించాడు...

26

చెన్నై సూపర్ కింగ్స్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న స్టీఫెన్ ఫ్లెమ్మింగ్, సౌతాఫ్రికా టీ20 టీమ్‌కి కూడా హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడని ఇప్ఫటికే అధికారికంగా ప్రకటించింది సీఎస్‌కే. ఎంఎస్ ధోనీని మెంటర్‌గా నియమించాలనుకుంది...

36

అయితే బీసీసీఐ మాత్రం మాహీకి ఊహించని షాక్ ఇచ్చింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత క్రికెటర్లు ఎవ్వరూ విదేశీ లీగుల్లో పాల్గొనడానికి వీల్లేదు. ఒకవేళ అలా ఆడితే వారికి దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్ ఆడే అవకాశం కూడా ఉండదు.. మాహీకి కూడా ఈ విషయంలో ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేసింది బీసీసీఐ...

46

అంతర్జాతీయ క్రికెట్‌కి ఇప్పటికే రిటైర్మెంట్ ఇచ్చినా ఐపీఎల్‌లో సీఎస్‌కే కెప్టెన్‌గా ఉన్నాడు ఎంఎస్ ధోనీ. 2021 సీజన్‌లో సీఎస్‌కేకి కెప్టెన్‌గా నాలుగో టైటిల్ కూడా అందించాడు. వచ్చే సీజన్‌లో చెన్నైలో మ్యాచులు ఆడిన తర్వాత ఐపీఎల్ నుంచి తప్పుకుంటానని కూడా వ్యాఖ్యానించాడు. 

56

దీంతో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనాలంటూ మాహీ, ఐపీఎల్‌కి దూరం కావాల్సి ఉంటుంది... అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఐపీఎల్ తప్ప, ఏ క్రికెట్ లీగ్‌లోనూ ఆడడం లేదు ఎంఎస్ ధోనీ. దీంతో ఐపీఎల్ లేదా సౌతాఫ్రికా టీ20 లీగ్‌... రెండింట్లో ఏదో ఒక్కదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితుల్లోకి మాహీని నెట్టేసింది బీసీసీఐ...

66

ఐపీఎల్‌లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఫ్రాంఛైజీల్లో ఒక్కటైన చెన్నై సూపర్ కింగ్స్‌ని ఎప్పట్లో వీడే ఆలోచనలో లేని ఎంఎస్ ధోనీ, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనాలనే ఆలోచనను విరమించుకున్నట్టు సమాచారం... 

Read more Photos on
click me!

Recommended Stories