ఐపీఎల్ కోసం ఎగ్జామ్స్ ఎగ్గొట్టా! ఎవరినైనా తిడితే టీమ్ నుంచి తీసేస్తారేమోనని.. రవి భిష్ణోయ్ కామెంట్స్...

Published : Mar 29, 2023, 10:19 AM IST

అండర్ 19 వరల్డ్ కప్ 2020 టోర్నీ నుంచి ఐపీఎల్‌లోకి, అటు నుంచి టీమిండియాలోకి మెరుపు వేగంతో దూసుకొచ్చాడు రవి భిష్ణోయ్. అండర్19 వరల్డ్ కప్ 2020 టోర్నీలో 17 వికెట్లు తీసిన రవి భిష్ణోయ్, టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు..

PREV
19
ఐపీఎల్ కోసం ఎగ్జామ్స్ ఎగ్గొట్టా! ఎవరినైనా తిడితే టీమ్ నుంచి తీసేస్తారేమోనని.. రవి భిష్ణోయ్ కామెంట్స్...
Ravi Bishnoi

అదే ఏడాది ఐపీఎల్ 2020 సీజన్ వేలంలో రూ.2 కోట్లకు పంజాబ్ కింగ్స్,రవి భిష్ణోయ్‌ని కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2020 సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన రవి భిష్ణోయ్, 12 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. 2021 సీజన్‌లో 9 మ్యాచులు ఆడిన రవి భిష్ణోయ్, 12 వికెట్లు తీసి మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు..

29
Image credit: Getty

ఐపీఎల్‌లో వరుసగా రెండు సీజన్లు ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వడంతో పాటు దేశవాళీ క్రికెట్ టోర్నీలో సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజారే ట్రోఫీ టోర్నీల్లోనూ మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు రవి భిష్ణోయ్. దీంతో వెస్టిండీస్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లకు రవి భిష్ణోయ్‌ని ఎంపిక చేశారు సెలక్టర్లు..
 

39
Ravi Bishnoi

రవిచంద్రన్ అశ్విన్ వైట్ బాల్ క్రికెట్‌కి దూరం కావడం, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా వరుసగా గాయపడుతుండడంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సరైన స్పిన్నర్‌ కోసం వెతుకున్న టీమిండియాకి రవిభిష్ణోయ్ రూపంలో ఓ యంగ్ స్పిన్నర్ ఆశాకిరణంలా కనిపించాడు...

49

ఐపీఎల్ 2022 సీజన్‌ కోసం లక్నో సూపర్ జెయింట్ జట్టు, రవిభిష్ణోయ్‌ని అన్‌క్యాప్డ్ ప్లేయర్ కోటా కింద రూ.4 కోట్లకు డ్రాఫ్ట్‌గా కొనుగోలు చేసింది... లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన రవి భిష్ణోయ్, 13 వికెట్లు పడగొట్టాడు...
 

59

టీమిండియా తరుపున ఓ వన్డే, 10 టీ20 మ్యాచులు ఆడిన రవి భిష్ణోయ్, మొత్తంగా 17 వికెట్లు పడగొట్టాడు. ఆసియా కప్‌ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో ఆఖరిగా ఆడాడు రవి భిష్ణోయ్. ఆ మ్యాచ్‌‌లో 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి ఓ వికెట్ తీసిన రవి భిష్ణోయ్, టీమిండియా తరపున బెస్ట్ ఎకానమీ నమోదు చేశాడు... అయితే ఆ మ్యాచ్ తర్వాత రవి భిష్ణోయ్‌న పూర్తిగా పక్కనబెట్టేసింది భారత జట్టు. 

69

‘రాజస్థాన్ రాయల్స్‌కి నెట్ బౌలర్‌గా ఉన్న సమయంలోనే నాకు 12వ తరగతి బోర్డు పరీక్షలు జరిగాయి. మా నాన్న నాకు ఫోన్ చేసి, వచ్చి ఎగ్జామ్స్ రాయమని గట్టిగా చెప్పారు. అయితే నా కోచ్, నా గురించి, నా ఆట గురించి చెప్పి మా నాన్నను ఒప్పించారు.. దీంతో ఆ ఏడాది పరీక్షలు రాయకుండా తర్వాతి ఏడాది పరీక్షలు ముగించాను...

79

10 ఏళ్ల వయసులో నేను క్రికెట్ అకాడమీలో చేరాను. 15 ఏళ్ల వయసులో చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేశాను. ఎందుకంటే నాకు క్రికెట్ ఆడేందుకు సమయం ఉండడం లేదని చదువును ఆపేశాను. అయితే మా అమ్మనాన్నలను ఒప్పించడం చాలా కష్టమైపోయింది...

89

నా టాలెంట్‌పై పూర్తి నమ్మకం పెట్టిన నా కోచ్, క్రికెట్‌పైన ఫోకస్ పెట్టేందుకు మా నాన్నను ఒప్పించాడు. అండర్19 వరల్డ్ కప్ ఫైనల్‌లో బంగ్లాదేశ్ మా బ్యాటర్లను చాలా బూతులు తిట్టారు. అయితే మేం ఫీల్డింగ్ చేసేటప్పుడు దాన్ని తిరిగిచ్చేశాం. అయితే గెలిచిన తర్వాత వాళ్లు గీత దాటి ప్రవర్తించారు.. అందుకే గొడవ జరిగింది.. 

99

నేను కూడా తీవ్ర ఆవేశానికి లోనై కొన్ని బూతులు మాట్లాడాను. ఆ తర్వాత నేను ఎవ్వరినీ సెడ్జ్ చేయలేదు. తిడితే నన్ను ఐపీఎల్ నుంచి తీసేస్తారేమోనని భయపడ్డాను..’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్..  

click me!

Recommended Stories