ఆమె వల్లే ఆర్‌సీబీకి దరిద్రం... సానియా మీర్జాని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్! విజయ్ మాల్యాని వదలకుండ...

Published : Mar 09, 2023, 05:15 PM IST

ఆర్‌సీబీ... క్రేజ్ విషయంలో ఈ టీమ్‌తో పోటీపడే టీమ్స్‌ లేవు. అలాగని ఇప్పటిదాకా ఈ ఫ్రాంఛైజీ ఒక్కటంటే ఒక్క టైటిల్ కూడా గెలిచింది లేదు. 16 సీజన్లుగా ఐపీఎల్‌లో పురుషుల ఐపీఎల్ టీమ్ ఫెయిల్ అవుతూ వస్తుంటే, మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆర్‌సీబీ టీమ్ అదే ఆనవాయితీని కొనసాగిస్తోంది...

PREV
17
ఆమె వల్లే ఆర్‌సీబీకి దరిద్రం...  సానియా మీర్జాని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్! విజయ్ మాల్యాని వదలకుండ...
Image credit: PTI

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ 2023లో మొదటి మూడు మ్యాచుల్లో చిత్తుగా ఓడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో 60 పరుగుల తేడాతో ఓడిన ఆర్‌సీబీ, రెండో మ్యాచ్‌లో ముంబై చేతుల్లో 9 వికెట్ల తేడాతో చిత్తు అయ్యింది...
 

27

గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 202 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 190 పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆఖరి ఓవర్లలో విజయానికి కావాల్సిన మార్జిన్‌ని దాటలేకపోయింది.. హ్యాట్రిక్ పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది ఉమెన్స్ ఆర్‌సీబీ...
 

37
RCB vs Gujarat Gaints

భారీ అంచనాలు పెట్టుకున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు భారీ అంచనాలు పెట్టుకున్న ఎలీసా పెర్రీ, రిచా ఘోష్, హేథర్ నైట్ విఫలమవుతున్నారు. భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన భారత స్టార్ బౌలర్ రేణుకా సింగ్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోతోంది...

47

ఆర్‌సీబీ ఫెయిల్యూర్‌తో సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. కొందరైతే ఆర్‌సీబీ ఓటమికి టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని ట్రోల్ చేస్తున్నారు. క్రికెట్‌లో ఓటమికి టెన్నిస్ ప్లేయర్‌కి కారణం ఏంటంటే... ఉమెన్స్ క్రికెట్‌ టీమ్‌కి మెంటర్‌గా టెన్నిస్ ప్లేయర్‌ని నియమించిన ఘనత ఆర్‌సీబీదే..
 

57
Image credit: Getty

ఇండియాలో మొట్టమొదటి స్టార్ ఉమెన్ ప్లేయర్ అంటే సానియా మీర్జానే... టీనేజ్ వయసులో వరుస విజయాలతో ఈ టెన్నిస్ స్టార్ పేరు, దేశమంతటా మార్మోగిపోయింది. అలాంటి మహిళను టీమ్‌కి మెంటర్‌గా పెడితే, ఆమె ప్లేయర్లను మానసికంగా ప్రోత్సహించి, వారి నుంచి 100 శాతం రిజల్ట్ రాబడుతుందని ఆశించింది ఆర్‌సీబీ...

67
RCB-Sania Mirza

అయితే క్రికెట్‌ టెక్నిక్స్ తెలియని సానియా మీర్జా, ఎన్ని మోటివేషనల్ క్లాస్‌లు ఇస్తే మాత్రం ఏం లాభం. ఆమె మోటివేషనల్ క్లాసుల దెబ్బకు స్మృతి మంధాన, ఎలీసా పెర్రీ ఆటను కూడా మరిచిపోతున్నారని, అందుకే సరిగా ఆడలేకపోతున్నారని మీమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి...

77

വിജയ് മല്ല്യ

 

ഡോക്യുമെന്ററി പ്രദര്‍ശിപ്പിച്ചാല്‍ തന്റെ സല്‍പേരിന് ദോഷമാണെന്നും കേസിനെ ബാധിക്കുമെന്നും മെഹുല്‍ ചോക്‌സി ആരോപിച്ചു. വിദേശത്തുള്ള ചോക്‌സി അഭിഭാഷകന്‍ വിജയ് അഗര്‍വാള്‍ വഴിയാണ് കോടതിയെ സമീപിച്ചത്.

ఆర్‌సీబీ ఫ్యాన్స్ అంతటితో ఆగలేదు. వేల కోట్ల స్కామ్ చేసి విదేశాలకు పారిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ యజమాని విజయ్ మాల్యాను కూడా ఇందులోకి లాగుతున్నారు. మాల్యా చేసిన మోసాలే, ఆర్‌సీబీ జట్టుకి శాపాలుగా మారాయని, అందుకే ఎంత మంది స్టార్లు ఉన్నా టైటిల్ గెలవలేకపోతోందని ట్రోల్స్ చేస్తున్నారు..

click me!

Recommended Stories