షాకింగ్... సీఎస్‌కేకి ధోనీ గుడ్‌బై... వచ్చే సీజన్‌ నుంచి వీళ్లు కూడా....

First Published Oct 20, 2020, 8:00 PM IST

IPL 2020 సీజన్‌లో చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. 10 సీజన్లలో జట్టును విజయవంతంగా నడిపించి, మూడు టైటిళ్లు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌లో వచ్చే సీజన్‌లో సమూలమైన మార్పులు జరగబోతున్నట్టు టాక్ వినబడుతోంది.

ధోనీ అవుట్... మహేంద్ర సింగ్ ధోనీ అంటూ సీఎస్‌కే, సీఎస్‌కే అంటే ధోనీ ముందుగా గుర్తొస్తారు. అలా ఐపీఎల్ ఫ్యాన్స్ మనసులో ముద్రపడింది. అయితే వచ్చే సీజన్‌లో సీఎస్‌కే నుంచి బయటికి రావాలనుకుంటున్నాడు ‘తలైవా’...
undefined
2020 సీజన్ ఆరంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. సీఎస్‌కే నుంచి బయటికి వచ్చి ఐపీఎల్ వేలంలో నిలవాలనే కోరికను ప్రకటించాడు.
undefined
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ చెల్లించే ఐపీఎల్ ఫీజు రూ.17 కోట్లతో సంతృప్తికరంగా లేడని, వేలంలో ఉంటే తనకి ఇంకా ఎక్కవ మొత్తం వస్తుందని ఆశపడుతున్నాడని టాక్ వినబడుతోంది.
undefined
ఈ సీజన్‌లో పేలవమైన ప్రదర్శన కారణంగా ఇప్పటికే ప్లేఆఫ్‌కి దూరమైంది చెన్నై సూపర్ కింగ్స్. దీంతో ధోనీ తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చని, వచ్చే సీజన్‌లో సీఎస్‌కేకి టైటిల్ అందించిన తర్వాత జట్టు నుంచి బయటికి వస్తాడని ‘తల’ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
undefined
కేదార్ జాదవ్... ఈ సీజన్‌లో చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు కేదార్ జాదవ్. జాదవ్‌ను ఏకంగా రూ.7 కోట్ల 80 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్.
undefined
ఆ భారీ మొత్తానికి ఏ మాత్రం న్యాయం చేయలేకపోయిన కేదార్ జాదవ్, ఇప్పటిదాకా ఆడిన 8 మ్యాచుల్లో కేవలం 62 పరుగులు మాత్రమే చేశాడు.. దాంతో వచ్చే సీజన్‌లో జాదవ్‌కి దండం పెట్టి వదిలించుకోవాలని చూస్తోంది చెన్నై జట్టు.
undefined
పియూష్ చావ్లా... జట్టులో సీనియర్ స్పిన్నర్‌గా ఉన్న పియూష్ చావ్లా వికెట్లు తీస్తున్నా... భారీగా పరుగులు ఇస్తున్నాడు.
undefined
7 మ్యాచుల్లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీసిన చావ్లాకి ఏటా రూ. 6 కోట్ల 75 లక్షల భారీ మొత్తం చెల్లిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్. అందుకే చావ్లాను వదులుకోవాలని చూస్తోంది సీఎస్‌కే.
undefined
లుంగి ఇంగిడి... సౌతాఫ్రికా పేసర్‌ను రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. మ్యాచ్ విన్నర్‌గా పేరు పొందిన ఇంగిడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు సారథి మహేంద్ర సింగ్ ధోనీ.
undefined
సీజన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 30 పరుగులు ఇవ్వడంతో కేవలం రెండు మ్యాచులు మాత్రమే ఆడి, 4 వికెట్లు తీశాడు ఇంగిడి.
undefined
ఇంగిడి కూడా వేరే జట్టులోకి వెళ్లాలని ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో ఇంగిడిని వచ్చే సీజన్‌లో విడుదల చేయాలని చూస్తోంది సీఎస్‌కే.
undefined
డ్వేన్ బ్రావో.. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఎన్నో సీజన్లుగా కొనసాగుతున్నాడు విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో. బ్రావోకి ఏటా రూ.6 కోట్ల 40 లక్షలు చెల్లిస్తోంది సీఎస్‌కే..
undefined
అయితే ఎక్కువగా గాయాల బారిన పడుతున్న బ్రావో ప్లేస్‌ను యంగ్ ఆల్‌రౌండర్‌ సామ్ కుర్రాన్‌తో పూరించాలని భావిస్తోంది సీఎస్‌కే.
undefined
జోష్ హజల్‌వుడ్... ఈ సీజన్‌లో ఆసీస్ పేసర్ హజల్‌వుడ్‌ని 2 కోట్లకి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే హజల్‌వుడ్ రెండు మ్యాచులు ఆడి ఒకే వికెట్ తీశాడు.
undefined
హజల్‌వుడ్ పర్ఫామెన్స్‌తో సంతృప్తి చెందని సీఎస్‌కే, వచ్చే సీజన్‌లో అతన్ని వదులుకోవాలని చూస్తోంది.
undefined
click me!