కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి రెండో విజయం... పంజాబ్ కింగ్స్‌పై ఈజీ విక్టరీ...

First Published Apr 26, 2021, 11:22 PM IST

ఐపీఎల్ 2021 సీజన‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి రెండో విజయం దక్కింది. మరీ ముఖ్యంగా వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్న కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మంచి బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో కోల్‌కత్తాకి విజయాన్ని అందించాడు. 124 పరుగుల టార్గెట్‌ను 5 వికెట్లు కోల్పోయి 16.4 ఓవర్లలో చేధించింది కోల్‌కత్తా.

124 పరుగుల స్వల్ప లక్ష్యచేధనలో కేకేఆర్‌కి శుభారంభం దక్కలేదు. నితీశ్ రాణా, పరుగులేమీ చేయకుండానే హెండ్రిక్స్ బౌలింగ్‌‌లో షారుక్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
undefined
ఆ తర్వాత కొద్దిసేపటికే 8 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సునీల్ నరైన్ కూడా 4 బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు.
undefined
అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన సునీల్ నరైన్, బౌండరీ లైన్ దగ్గర రవి బిష్ణోయ్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కి అవుట్ అయ్యాడు.
undefined
17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ని రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ కలిసి ఆదుకున్నారు. ఇద్దరూ నాలుగో వికెట్‌కి 67 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు.
undefined
32 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా బౌలింగ్‌లో షారుక్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
undefined
9 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన ఆండ్రే రస్సెల్, రనౌట్ కాగా మోర్గాన్, కార్తీక్ కలిసి మ్యాచ్‌ను ముగించారు. దినేశ్ కార్తీక్ 6 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేయగా మోర్గాన్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
undefined
click me!