400 కొట్టినా సరిపోలేదా, అయితే 600 కొడతా... సెలక్టర్లపై నితీశ్ రాణా కామెంట్...

First Published Aug 13, 2022, 3:49 PM IST

ఐపీఎల్‌లో నిలకడగా మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నా రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణా వంటి క్రికెటర్లకు టీమిండియాలో ఆడేందుకు రావాల్సినన్ని అవకాశాలు దక్కడం లేదు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉన్న రాహుల్ త్రిపాఠిని నామమాత్రపు మ్యాచులు ఆడించింది టీమిండియా...

గత ఏడాది శ్రీలంకలో పర్యటించిన భారత బీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు నితీశ్ రాణా. శ్రీలంకపై అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ఈ కేకేఆర్ బ్యాటర్, మొదటి సిరీస్‌లో పెద్దగా మెప్పించలేకపోయాడు...

Nitish Rana

తాజాగా జింబాబ్వే టూర్‌కి ఎంపిక చేసిన జట్టులో నితీశ్ రాణాకి చోటు దక్కలేదు. రాహుల్ త్రిపాఠికి మరో అవకాశం ఇచ్చిన సెలక్టర్లు, శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ వంటి ప్లేయర్లకు జింబాబ్వే సిరీస్‌లో అవకాశం ఇచ్చారు...

28 ఏళ్ల నితీశ్ రాణా, ఐపీఎల్ 2022లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున 14 ఇన్నింగ్స్‌ల్లో 361 పరుగులు చేశాడు. అయినా అతన్ని జింబాబ్వే టూర్‌కి కూడా ఎంపిక చేయలేదు సెలక్టర్లు. దీనిపై తాజాగా స్పందించాడు నితీశ్ రాణా...

‘ఓ క్రికెటర్‌గా నేను నాకు అవకాశం వచ్చేవరకూ ఎదురుచూస్తా. అయితే నన్ను సెలక్ట్ చేయలేదని నేను సెలక్టర్లను తప్పు బట్టడం లేదు. నేను సరిగ్గా ఆడడం లేదని వాళ్లు అనుకుని ఉండొచ్చు...

ఈ సారి చేసిన పరుగులు సరిపోలేదేమో. అందుకే వచ్చే ఐపీఎల్ సీజన్‌లో 500+ పరుగులు చేసి, సెలక్టర్లు నన్ను సెలక్ట్ చేసేలా చేయాలనుకుంటున్నా.. 

కొన్నిసార్లు పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు. మంచిగా ఆడాలనుకున్నా ఆడలేం, పరుగులు చేయలేం. అందుకే నన్ను నేను ఎప్పుడూ మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటా...

ఈ సీజన్‌లో నేను ఎక్కువ పరుగులు చేయాలనే టార్గెట్‌తోనే ఆడాను, అయితే అనుకున్నన్ని పరుగులు మాత్రం చేయలేకపోయా. 400 కొట్టిన తర్వాత కూడా నన్ను సెలక్ట్ చేయలేదంటే, 600 చేయడానికి ప్రయత్నిస్తా..

ప్రస్తుతం అవకాశాలు నా చేతుల్లో లేకపోవచ్చు, భవిష్యత్తులో వాటిని అందుకునే అవకాశం మాత్రం నా చేతుల్లోనే ఉంది. నేను దానిపైనే ఫోకస్ పెడుతున్నా. దేశవాళీ టోర్నీల్లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలి...’ అంటూ కామెంట్ చేశాడు నితీశ్ రాణా...

Nitish Rana

‘గత సీజన్‌లో మేం టైటిల్ గెలుస్తామని అనుకున్నాం. అయితే అది వీలు కాలేదు. ఈసారి వేలంలో కొన్ని చిన్నచిన్న మార్పులు చేయాలి. మనవాళ్లు బాగా ఆడితే టైటిల్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు..’ అంటూ కామెంట్ చేశాడు రాణా... 

click me!