కోహ్లీ కన్నా రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్: లెక్కలు ఇవే...

First Published May 17, 2019, 3:06 PM IST

కోహ్లీ కన్నా రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్: లెక్కలు ఇవే...

హైదరాబాద్: విరాట్ కోహ్లీ ప్రపంచంలో మేటి బ్యాట్స్ మన్ అనే విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. సచిన్ టెండూల్కర్ తర్వాత అంత మేటి బ్యాట్స్ మన్ గా కోహ్లీని చెప్పుకోవచ్చు. టెస్టు క్రికెట్ ను పక్కన పెడితే పొట్టి క్రికెట్ లో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ సక్సెస్ రేటు రోహిత్ శర్మ కన్నా తక్కువ ఉంది. వన్డేల్లో, టీ20ల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ విజయాలు విరాట్ కోహ్లీ కన్నా ఎక్కువగా ఉన్నాయి. లెక్కలే ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి.
undefined
రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ఇటీవల ఐపిఎల్ కప్ ను ఎగురేసుకుపోయిన విషయం తెలిసిందే. అది కూడా కెప్టెన్సీలో తిరుగులేని మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ను ముంబై ఇండియన్స్ ఓడించింది. చివరి బంతి వరకు మ్యాచ్ ను లైవ్ గా ఉంచి, అచ్చం ధోనీలాగే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కు విజయాన్ని సాధించి పెట్టాడు.
undefined
రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ నాలుగు సార్లు ఐపిఎల్ టైటిల్ ను గెలుచుకోగా, విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒక్క సారి కూడా ట్రోఫిని గెలుచుకోలేకపోయింది. ఇద్దరు కూడా తమ తమ జట్లకు 2013 నుంచే నాయకత్వం వహిస్తూ వస్తున్నారు.
undefined
ఐపిఎల్ లో రోహిత్ శర్మ 104 మ్యాచులకు నాయకత్వం వహించి 60 మ్యాచులు గెలిపించాడు. విక్టరీ పర్సెంటేజీ 58.65. విరాట్ కోహ్లీ 110 మ్యాచులకు నాయకత్వం వహించి 49 మ్యాచులను గెలిపించాడు. విక్టరీ పర్సెంటేజీ 47.15 శాతం. దీన్ని బట్టి రోహిత్ శర్మ కెప్టెన్సీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ మెరుగ్గా ఉందని తెలిసిపోతుంది.
undefined
రోహిత్ శర్మ 10 అంతర్జాతీయ వన్డే మ్యాచులకు నాయకత్వం వహించి 8 మ్యాచులను గెలిపించాడు. అతని నాయకత్వంలో భారత జట్టు 80 శాతం విజయాలను అందుకుంది. పైగా, రోహిత్ శర్మ నాయకత్వం వహించినప్పుడు సీనియర్లకు విశ్రాంతి కల్పించి, జూనియర్లను జట్టుకు ఎంపిక చేయడం కూడా పరిపాటిగా మారింది. ఆ స్థితిలోనూ రోహిత్ శర్మ విజయాలను రాబట్టాడు.
undefined
విరాట్ కోహ్లీ 65 అంతర్జాతీయ వన్డే మ్యాచులకు నాయకత్వం వహించి 45 మ్యాచులను గెలిపించాడు. ఆయన విక్టరీ పర్సెంటేజీ 78 శాతం ఉంది. ఎక్కువ మ్యాచులకు నాయకత్వం వహించడం వల్ల ఈ విజయాలను రోహిత్ శర్మ నాయకత్వంలోని జట్టు పోల్చలేమని అనుకోవచ్చు. కానీ విజయాల లెక్క మాత్రం రోహిత్ కన్నా కోహ్లీది తక్కువే ఉంది.
undefined
ట్వంటీ20 మ్యాచుల్లోనూ సక్సెస్ రేటు రోహిత్ శర్మదే ఎక్కువగా ఉంది. రోహీత్ శర్మ 15 టీ20 మ్యాచులకు నాయకత్వం వహించి 12 మ్యాచులు గెలిపించాడు. విరాట్ కోహ్లీ 22 టీ20 మ్యాచులకు నాయకత్వం వహించి 12 మ్యాచులు గెలిపించాడు.
undefined
ధోనీ లేకుండా విరాట్ కోహ్లీ సక్సెస్ అంత మాత్రమైనా ఉండేదా అనేది ఓ ప్రశ్న. 2008లో అండర్ 19 జట్టుకు నాయకత్వం వహించి ప్రపంచ కప్ ను ఎగురేసుకొచ్చిన సందర్భం కోహ్లీ విషయంలో అత్యంత ప్రధానమైందే. ఈ ఏడాది ఐసిసి వన్డే ప్రపంచ కప్ పోటీలకు ఎంపిక చేసిన జట్టులో రిషబ్ పంత్ ను పక్కన పెట్టేసి ధోనీని ఎంపిక చేయడం విరాట్ కోహ్లీ కోసమేననే వాదన కూడా ఉంది.
undefined
ధోనీ నాయకత్వంలోని జట్టును ఓడించడం సాధ్యం కాదనే మనో స్థితికి ప్రత్యర్థి జట్టు కెప్టెన్లు మ్యాచు ప్రారంభంలోనే వచ్చేస్తారు. ఈ ఐపిఎల్ సీజన్ లో ధోనీ నాయకత్వం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ ను రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ క్వాలిఫయిర్ మ్యాచులోనే కాకుండా ఫైనల్ మ్యాచులోనూ ఓడించింది.
undefined
ధోనీ లాగానే రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచులో చివరి వరకు కూడా ఓటమిని అంగీకరించలేదు. దానివల్లే జట్టు విజయం సాధించిందని చెప్పాలి. అంతకు ముందు ఓవరులో భారీగా పరుగులు ఇచ్చుకున్న మలింగ చేత చివరి ఓవరు వేయించడం వంటి సాహసాన్ని ధోనీ లాంటి వాళ్లు మాత్రమే చేయగలరు. అదే పని రోహిత్ శర్మ చేసి విజయాన్ని అంది పుచ్చుకున్నాడు.
undefined
తుది జట్టుకు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే విషయంలో రోహిత్ శర్మ ధోనీ పద్ధతిని అనుసరిస్తాడు. కొన్ని మ్యాచుల్లో విఫలమైనప్పటికీ ఆటగాళ్లను కొనసాగిస్తాడు. ఈ ఐపిఎల్ సీజన్ లో పోలార్డ్ సరిగా ఆడకపోయినా ఫైనల్ మ్యాచులో అతని చేత ఆడించాడు. అతని వల్లనే ముంబై ఇండియన్స్ ఫైనల్లో విజయం సాధించిందని చెప్పవచ్చు.
undefined
విరాట్ కోహ్లీ ఆటగాళ్లను కంటిన్యూ చేయడంలో స్థిరంగా ఉండడు. తుది జట్టును పదే పదే మారుస్తూ ఉంటాడు. అది ఆటగాళ్ల మీద నమ్మకం ఉంచకపోవడమేనని అనిపిస్తూ ఉంటుంది. క్రిస్ గేల్, సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లు రాయల్ చాలెంజర్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా రాణిస్తుండడం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చు.
undefined
పరిస్థితిని అంచనా వేసి, అందుకు తగిన విధంగా వ్యూహాలు రచించడంలో రోహిత్ శర్మ ధోనీ లాగా వ్యవహరిస్తాడు. మైదానంలో తోటి ఆటగాళ్లకు ధీటుగా ఆడుతూనే పరిస్థితులకు తగినట్లు వ్యూహాలను మారుస్తూ ఉండడం రోహిత్ శర్మ ధోనీ నుంచే నేర్చుకున్నాడని చెప్పవచ్చు.
undefined
విరాట్ కోహ్లీ గేమ్ ను రీడ్ చేయడంలో అంతగా శ్రద్ధ పెట్టినట్లు కనిపించడు. పైగా, బౌండరీ వద్ద ఎక్కడో ఫీల్డింగ్ చేస్తూ బౌలర్లకు అందుబాటులో ఉండడు. బౌలర్లకు దగ్గరగా ఫీల్డింగ్ ప్లేస్ మెంట్ ను తీసుకుంటే, ఎప్పటికప్పుడు వారికి సలహాలు, సూచనలు అందించడానికి కెప్టెన్ కు అవకాశం ఉంటుంది. అటగాళ్లను సమర్థంగా వాడుకోవడానికి వీలవుతుంది. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ విధానాన్ని పరిశీలిస్తూ దానికి అనుగుణంగా బౌలింగ్ ను మార్చుకోవడానికి అవసరమైన సూచనలు కెప్టెన్ నుంచి బౌలర్లకు అందితే ఫలితాలు బాగుంటాయనే విషయం ధోనీ నుంచే నేర్చుకోవాలి .
undefined
2007లో టీ20 ప్రపంచ కప్ ఇండియా వెళ్లినప్పుడు ధోనీ కెప్టెన్సీలో కప్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. ధోనీ ప్లేయర్స్ కు వారి వారి పాత్రలను, బాధ్యతలను అప్పగించాడు. ఆటగాళ్లను సద్వినియోగం చేసుకున్నాడు. అందువల్లే టీమిండియా విజయం సాధించింది.
undefined
అతి సాధారణంగా కనిపించే అటగాళ్లున్న ముంబై జట్టు ఐపిఎల్ కప్ ను కొట్టేసింది. ఆటగాళ్లను సమర్థంగా వాడుకునే నేర్పు రోహిత్ శర్మకు ఉండడం వల్లనే అది సాధ్యమైంది. కోల్ కతాతో జరిగిన మ్యాచులో ఆండ్య్రూ రసెల్ కు మలింగ చేత బౌలింగ్ చేయించడం అందుకు ఓ ఉదాహరణ. కొత్తవాడైన చాహర్ సమర్థవంతమైన బౌలరుగా ముందుకు రావడం వెనక రోహిత్ శర్మ కెప్టెన్సీ నేర్పు ఉంది.
undefined
ముంబై ఇండియన్స్ జట్టుతో పోలిస్తే కోహ్లీ నాయకత్వం వహించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టులో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆటగాళ్లున్నారు. డీవిల్లీర్స్, చాహల్, మొయిన్ అలీ వంటి అరివీర భయంకరమైన ఆటగాళ్లున్నారు. కానీ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వారికి తగిన బాధ్యతలు అప్పగించకపోవడం వల్లనే రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ విఫలమైందని చెప్పాలి.
undefined
click me!