IPL2021 DC vs MI: ముంబై ఇండియన్స్‌కి షాక్... డిఫెండింగ్ ఛాంపియన్ ప్లేఆఫ్ ఛాన్స్‌లు సంక్లిష్టం...

First Published Oct 2, 2021, 7:22 PM IST

ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయినా, ముంబై ఇండియన్స్ బౌలర్లు మాత్రం అదిరిపోయే ఫైటింగ్ స్పిరిట్ చూపించారు. ఆఖరి ఓవర్ వరకూ సాగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది...

130 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్, వరుస వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 
7 బంతుల్లో ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసిన శిఖర్ ధావన్, పోలార్డ్ విసిరిన ఓ సూపర్ త్రోకి రనౌట్ అయ్యాడు. 

ఆ తర్వాత 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన పృథ్వీషా, కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూకి వెళ్లిన ముంబై ఇండియన్స్‌కి అనుకూలంగా ఫలితం వచ్చింది...

8 బంతుల్లో ఓ సిక్సర్‌తో 9 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ను కౌంటర్‌నైల్ బౌల్డ్ చేయగా 22 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన రిషబ్ పంత్, జయంత్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి హార్ధిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన అక్షర్ పటేల్ 9 బంతుల్లో 9 పరుగులు చేసి పెవిలియన్ చేరగా సిమ్రన్ హెట్మయర్ 8 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

93 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆదుకునే బాధ్యతను తీసుకున్న రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్... ఏడో వికెట్‌కి 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

ఆఖరి ఓవర్‌లో విజయానికి 4 పరుగులు కావాల్సిన దశలో సిక్సర్‌ బాదిన రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్‌ను ముగించాడు... అశ్విన్ 21 బంతుల్లో ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ 33 బంతుల్లో 2 ఫోర్లతో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు..

click me!