ఐపీఎల్ వల్లే మా నాన్న ప్రాణం నిలబడింది... రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ చేతన్ సకారియా...

First Published May 7, 2021, 3:05 PM IST

ఐపీఎల్ ఆరంగ్రేటం సీజన్‌లోనే అదిరిపోయే పర్ఫామెన్స్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు రాజస్థాన్ రాయల్స్ యంగ్ బౌలర్ చేతన్ సకారియా. బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో అదరగొట్టి కళ్లు చెదిరే క్యాచులు అందుకున్న సకారియాకి ఐపీఎల్ డబ్బు ఎంతో సాయం చేసిందట.

ఐపీఎల్ 2021 సీజన్‌ కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లకు చెల్లించాల్సిన పారితోషికం మాత్రం పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది...
undefined
‘ఐపీఎల్ నా జీవితాన్ని మార్చేసింది. నిజం చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతుడిని. కరెక్టుగా నాకు అవసరమైన సమయంలో ఐపీఎల్ డబ్బు అందింది...
undefined
నేను వెంటనే ఆ డబ్బును ఇంటికి పంపించాను. మా నాన్నకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనకి మెరుగైన చికిత్స అందించడానికి ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడింది...
undefined
ఒకవేళ ఈ టోర్నీ జరగకపోయి ఉంటే... అనే ఆలోచనే నాకు భయం కలిగిస్తోంది. కరోనా కారణంగా చాలా మంది కరోనా ఆపేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు నేను చాలా భయపడ్డాను.
undefined
ఐపీఎల్ ఆపేయాలని డిమాండ్ చేసిన వారికి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్న మాలాంటి క్రికెటర్లకు ఐపీఎల్ ఎంతగానో సాయం చేస్తోంది. సంపాదనకు మాకున్న ఒకే ఒక్క మార్గం ఇది.
undefined
ఈ లీగ్ లేకపోయి ఉంటే మా నాన్నగారు నాకు దక్కేవారు కాదేమో... నా తండ్రి ఓ టెంపో డ్రైవర్‌గా పనిచేస్తూ మమ్మల్ని పెంచారు.
undefined
నాలా నిరుపేద కుటుంబం నుంచి క్రికెట్ కెరీర్‌గా ఎంచుకోవాలని భావించేవారికి ఐపీఎల్ ఇచ్చే అండ ఇంత అంతా కాదు... ఇది నా జీవితంలో టర్నింగ్ పాయింట్’ అంటూ చెప్పుకొచ్చాడు చేతన్ సకారియా...
undefined
ఐపీఎల్ 2021 వేలంలో చేతన్ సకారియాను రూ.కోటి 20 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. మొదటి మ్యాచ్‌లోనే మయాంక్ అగర్వాల్‌తో పాటు కెఎల్ రాహుల్, జే రిచర్డ్‌సన్‌ వికెట్లు తీసిన చేతన్ సకారియా, సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ధోనీని అవుట్ చేశాడు.
undefined
మొత్తంగా ఏడు మ్యాచుల్లో ఏడు వికెట్లు తీసిన చేతన్ సకారియా... మూడు అద్భుతమైన క్యాచులు కూడా అందుకున్నాడు. మొదటి మ్యాచ్‌లో సకారియా అందుకున్న నికోలస్ పూరన్ క్యాచ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్‌గా నిలిచింది.
undefined
click me!