IPL 2023: ఐపీఎల్-16లో ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ పేరిట ఇదివరకే లెక్కకు మిక్కిలి రికార్డలున్నాయి. తాజాగా ముంబై తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో కోహ్లీ మరో ఘనతను అందుకున్నాడు.
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ లీగ్ లో 50+ స్కోర్లను 50 సార్లు చేసిన తొలి భారత బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. ఆదివారం ముంబై ఇండియన్స్ తో బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ (82 నాటౌట్) చేయడం ద్వారా కోహ్లీ.. ఈ లీగ్ లో ఫిఫ్టీ ప్లస్ స్కోర్లను యాభై సార్లు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
26
Image credit: PTI
ఈ లీగ్ లో వాస్తవానికి కోహ్లీ సాధించిన హాఫ్ సెంచరీలు 45 మాత్రమే. కానీ ఐపీఎల్ లో కోహ్లీ పేరిట ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి. వాటిని కలుపుకుని ఈ లీగ్ లో 50+ స్కోర్లను 50 సార్లు చేసిన తొలి భారత బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు.
36
ఐపీఎల్ లో 50+ స్కోర్లను యాభై సార్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్ అందరికంటే ముందున్నాడు. వార్నర్.. 163 మ్యాచ్ లలో ఏకంగా 60 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లను చేశాడు. ఇందులో 56 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలున్నాయి.
46
Image credit: PTI
ఈ జాబితాలో వార్నర్ (60, కోహ్లీ (50) తర్వాత శిఖర్ ధావన్ (49 సార్లు) ఉన్నాడు. ధావన్ ఐపీఎల్ లో 47 హాఫ్ సెంచరీలు రెండు సెంచరీలు ఉన్నాయి. ధావన్ తర్వాత ఏబి డివిలియర్స్ (43 సార్లు : 40 ఫిఫ్టీలు, 3 సెంచరీలు), రోహిత్ శర్మ 43 : 40 ఫిఫ్టీలు, 1 సెంచరీ) ఉన్నారు.
56
కాగా ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ మాత్రం కోహ్లీనే. కోహ్లీ ఐపీఎల్ లో 2008 నుంచి ఒకే టీమ్ (ఆర్సీబీ) కు ఆడుతున్నాడు. మొత్తంగా తన ఐపీఎల్ కెరీర్ లో 224 మ్యాచ్ లు ఆడి 216 ఇన్నింగ్స్ లలో 6,706 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి.
66
ఐపీఎల్ లో ఆరు వేల మైలురాయిని చేరిన తొలి క్రికెటర్ కోహ్లీనే. మరో 294 పరుగులు చేస్తే కోహ్లీ 7 వేల పరుగుల క్లబ్ లో చేరతాడు. కోహ్లీ ప్రస్తుతం ఉన్న పామ్ ను చూస్తే ఈ సీజన్ లోనే 7 వేల పరుగుల క్లబ్ లో చేరడం ఖాయమని అనిపిస్తున్నది.