ఆడనిచ్చారు అది చాలు! తన కెరీర్‌కి అదే టర్నింగ్ పాయింట్ అంటున్న అజింకా రహానే...

First Published Apr 25, 2023, 6:06 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి వచ్చాడు దినేశ్ కార్తీక్. ఏకంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పుడు 2023 సీజన్‌లో అజింకా రహానే పర్ఫామెన్స్, అతనికి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే అవకాశాన్ని తెచ్చిపెట్టింది...

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 టోర్నీలో ఆడిలైడ్ టెస్టులో ఘోర పరాజయం తర్వాత విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ కింద స్వదేశానికి వెళ్లిపోయాడు. అలాంటి టైమ్‌లో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న అజింకా రహానే, మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ చేసి టీమ్‌కి అద్భుత విజయం అందించాడు...

Ajinkya Rahane

సిడ్నీలో జరిగిన టెస్టును డ్రా చేసుకున్న భారత జట్టు, బ్రిస్బేన్‌లో ఆసీస్ కంచుకోటను పగులకొట్టి... 2-1 తేడాతో టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్ తర్వాత అజింకా రహానేకి ఫ్యాన్స్, ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది...

Latest Videos


అయితే అదే ఏడాది డిసెంబర్‌లో టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ కోల్పోయాడు అజింకా రహానే... రహానేని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడంతో సౌతాఫ్రికా టూర్‌లో టెస్టు సిరీస్‌కి కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించి, ఓ టెస్టుకి కెప్టెన్సీ కూడా చేసి... టీమిండియా ఓటమికి కారణమయ్యాడు...

Ajinkya Rahane

సౌతాఫ్రికా టూర్‌లో విఫలం కావడంతో అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారాలను టెస్టు టీమ్ నుంచి తప్పించింది టీమిండియా. పూజారా, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సంచలన ప్రదర్శన ఇచ్చి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వగా... అజింకా రహానే కెరీర్ ఇక ముగిసినట్టే అనుకున్నారంతా. 

Ajinkya Rahane

అన్యూహ్యంగా ఐపీఎల్ 2023 సీజన్‌లో అదరగొట్టడంతో పాటు శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా గాయపడడం, సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ అవుతుండడం అజింకా రహానేకి బాగా కలిసి వచ్చారు. అయితే  రహానే ఇచ్చిన పర్ఫామెన్స్‌కి అతనికి టీ20ల్లో ఛాన్స్ ఇచ్చినా తప్పులేదు...

Ajinkya Rahane

‘ధోనీ కెప్టెన్సీలో ఆడేటప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటాం. ఓ బ్యాటర్‌గా,ఓ క్రికెటర్‌గా నన్ను నేనెప్పుడూ మరింత మెరుగ్గా చేసుకునేందుకు తాపత్రయపడుతూనే ఉంటాను. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడే అవకాశం రావడమే నా కెరీర్‌కి టర్నింగ్ పాయింట్...

నాకు ప్లేయింగ్ ఎలెవన్‌కి ఎప్పుడు చోటు దక్కుతుందా అని ఎదురుచూశాను. ఛాన్స్ వచ్చాక దాన్ని చేజార్చుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యా. నా స్కిల్స్‌పైన నాకు పూర్తి నమ్మకం ఉంది. సీఎస్‌కే నన్ను తీసుకోవడం, ఆడే అవకాశం ఇవ్వడం నా కెరీర్‌కి టర్నింగ్ పాయింట్...
 

Image credit: PTI

రెండేళ్లుగా నాకు ఐపీఎల్‌లో ఆడే అవకాశాలు ఎక్కువగా రాలేదు. మ్యాచులు ఆడకపోతే నా అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలను ఎలా వాడగలను. ఇప్పటికీ వాటిని ఉపయోగించే అవకాశం లభించింది...’ అంటూ కామెంట్ చేశాడు అజింకా రహానే..

click me!