అప్పుడు ధోనీ, ఇప్పుడు సంజూ శాంసన్... యశస్వి జైస్వాల్ కోసం దాన్ని వదులుకున్న రాయల్స్ కెప్టెన్...

First Published May 12, 2023, 9:37 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా బరిలో దిగింది రాజస్థాన్ రాయల్స్. మొదటి 5 మ్యాచుల్లో నాలుగు విజయాలు అందుకున్న రాయల్స్, ఆ తర్వాత 6 మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం అందుకుంది...
 

Sanju Samson

ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్‌పై ఘన విజయం అందుకుంది. యశస్వి జైస్వాల్ సెన్సేషనల్ ఇన్నింగ్స్‌తో కేకేఆర్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు.

Sanju Samson

47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్... 2 పరుగుల తేడాతో సెంచరీని మిస్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 48 పరుగులు చేసి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు..

Latest Videos


రాజస్థాన్ రాయల్స్ విజయానికి 3 పరుగులు కావాల్సిన దశలో సుయాశ్ శర్మ వైడ్ బాల్ వేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ బంతిని ముందుగానే ఊహించిన సంజూ శాంసన్, దాన్ని టచ్ చేశాడు..

Sanju and Jaiswal

ఆ బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా, సంజూ శాంసన్ డిఫెండ్ చేశాడు. సంజూ సింగిల్ తీసి ఉంటే, తర్వాతి ఓవర్‌లో కూడా స్ట్రైయిక్ వచ్చేది. సింగిల్ తీసినా హాఫ్ సెంచరీ పూర్తయ్యేది..

sanju samson

అయితే 94 పరుగుల వద్ద ఉన్న యశస్వి జైస్వాల్‌, సెంచరీ చేసుకోవాలనే ఉద్దేశంతో తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడు సంజూ శాంసన్. సిక్సర్ కొట్టి, సెంచరీ పూర్తి చేసుకోవాల్సిందిగా జైస్వాల్‌కి సైగలు చేశాడు..

అయితే శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో వైడ్ యార్కర్‌ని ఫోర్‌గానే మలిచిన యశస్వి జైస్వాల్, 2 పరుగుల దూరంలో ఆగిపోయాడు. అయితే అతను ఆడిన ఇన్నింగ్స్ సెంచరీ కంటే ఎక్కువే...
 

2016లో ఆస్ట్రేలియాతో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 51 బంతుల్లో 82 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీ రోల్ పోషించాడు. ఈ మ్యాచ్‌లో 19వ ఓవర్‌ బంతికి సింగిల్ తీస్తే టీమిండియా గెలిచి ఉండేది.

అయితే ధోనీ, ఆ బంతిని డిఫెన్స్ ఆడి... విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫినిష్ చేసే అవకాశం ఇచ్చాడు. ధోనీ చేసిన ఈ పని, అభిమానుల మనసు దోచుకుంది. ఐపీఎల్‌లో సంజూ శాంసన్ కూడా ఇలాంటి పని చేసి ఓ మెట్టు ఎక్కేశాడు.. 

click me!