ఐపీఎల్ 2023: ఆఖరి ఐపీఎల్ ఆడబోతున్న ప్లేయర్లు వీరే! ధోనీతో పాటు లిస్టులో...

First Published Mar 28, 2023, 10:27 AM IST

ఐపీఎల్ 2023 సీజన్ మరో 3 రోజుల్లో మొదలుకాబోతోంది. 16వ సీజన్‌లో ఐదోసారి టైటిల్ గెలవాలని చెన్నై సూపర్ కింగ్స్, ఆరో టైటిల్ ఖాతాలో వేసుకోవాలని ముంబై ఇండియన్స్ ఆశపడుతున్నాయి. ఆర్‌సీబీతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తొలి టైటిల్ కోసం పోరాడబోతున్నాయి...

ఐపీఎల్ 2023 కొందరు ప్లేయర్లకు ఆఖరి సీజన్ కానుంది. ‌ ఐపీఎల్ 2020 సీజన్‌కి ముందు అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీ, సొంత మైదానంలో చెన్నై అభిమానుల మధ్య రిటైర్మెంట్ తీసుకుంటానని ప్రకటించాడు. మూడు సీజన్ల తర్వాత చెపాక్ స్టేడియంలో మ్యాచ్ ఆడబోతోంది సీఎస్‌కే. దీంతో ఈసారి మాహీ రిటైర్ అవుతాడని జోరుగా ప్రచారం జరుగుతోంది...

Ishant-Sharma DC

35 ఏళ్ల ఇషాంత్ శర్మ, 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. 2018, 2022 సీజన్‌లలో గాయం కారణంగా ఐపీఎల్ ఆడలేకపోయిన ఇషాంత్ శర్మ, ఏ సీజన్‌లోనూ 14 మ్యాచులు ఆడలేదు. 2019 సీజన్‌లో  13 మ్యాచులు ఆడిన ఇషాంత్, 2020లో ఒకటి, 2021లో 3 మ్యాచులు మాత్రమే ఆడాడు. 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడబోతున్న ఇషాంత్ శర్మ, ఏడాదిగా అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమయ్యాడు. 2023 ఐపీఎల్ తర్వాత ఇషాంత్, రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది..

Latest Videos


అంబటి రాయుడు, సీఎస్‌కేకి మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ఆడుతున్నాడు. 38 ఏళ్ల అంబటి రాయుడు, గత సీజన్‌లో 274 పరుగులు చేశాడు. 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చి, వెనక్కి తీసుకున్న అంబటి రాయుడు, ఐపీఎల్ 2023 తర్వాత క్రికెట్‌కి గుడ్‌బై చెప్పే అవకాశాలు  పుష్కలంగా ఉన్నాయి...
 

ఐపీఎల్ 2008 నుంచి 2021 వరకూ ప్రతీ సీజన్‌లోనూ ఆడిన ప్లేయర్లలో అమిత్ మిశ్రా ఒకడు. అయితే 2022 మెగా వేలంలో అమిత్ మిశ్రాని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడబోతున్న 40 ఏళ్ల అమిత్ మిశ్రా, ఐపీఎల్‌లో 166 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌తో మిశ్రా రిటైర్ అవ్వొచ్చు.

అమిత్ మిశ్రా మాదిరిగానే ఐపీఎల్ 2008 సీజన్‌లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లా, 2022 మెగా వేలంలో అమ్ముడుపోలేదు. ఐపీఎల్ చరిత్రలో 157 వికెట్లు తీసిన 35 ఏళ్ల పియూష్ చావ్లా, ఈసారి ముంబై ఇండియన్స్ తరుపున ఆడబోతున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత పియూష్ చావ్లా రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు పుషల్కంగా ఉన్నాయి..
 

38 ఏళ్ల వయసులో గుజరాత్ టైటాన్స్, ఐపీఎల్ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు వృద్ధిమాన్ సాహా. 2008 నుంచి ప్రతీ సీజన్‌లోనూ ఆడుతున్న వృద్ధిమాన్ సాహా, ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత రిటైర్మెంట్ ఇవ్వవచ్చు.. 

Image credit: PTI

37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు దినేశ్ కార్తీక్. ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలు ఆడిన దినేశ్ కార్తీక్, 2008 నుంచి ప్రతీ సీజన్‌లోనూ  ఆడుతున్న ప్లేయర్లలో ఒకడు. ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత దినేశ్ కార్తీక్ రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి..

click me!