హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండరే కానీ! పర్ఫెక్ట్ ప్లేయర్ కాదు... పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ కామెంట్...

Published : Mar 28, 2023, 11:33 AM IST

పాక్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్, హార్ధిక్ పాండ్యాపై చేసిన కొన్ని కామెంట్లు వివాదాస్పదం అవుతున్నాయి. హార్ధిక్ పాండ్యా మంచి ఆల్‌రౌండరే అయినా కపిల్‌ దేవ్‌తో పోల్చాల్సినంత టాలెంట్, అతనిలో లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు అబ్దుల్ రజాక్... 

PREV
16
హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండరే కానీ! పర్ఫెక్ట్ ప్లేయర్ కాదు... పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ కామెంట్...
Image credit: PTI

‘నేను హార్ధిక్ పాండ్యాపై చేసిన వ్యాఖ్యలు కొంత మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఓ క్రికెటర్‌గా హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్, కెప్టెన్సీ కూడా చేయగలడని ఇప్పటికే నిరూపితమైంది...
 

26
Hardik Pandya

అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదు. అయితే ఏ  ప్లేయర్ కూడా పర్ఫెక్ట్ కాదు. నేను, హార్ధిక్ పాండ్యా ఇండియన్ ప్లేయర్ కాబట్టి ఇలా చెప్పానని చాలామంది కామెంట్ చేశారు. ఇక్కడ అతను ఇండియన్ ప్లేయర్ ఆ, లేక ఇంగ్లాండ్ ప్లేయరా? లేక ఆస్ట్రేలియా ఆటగాడా? అనేది సమస్య కాదు..

36
Image credit: PTI

ఓ సీనియర్ క్రికెటర్‌గా, మరో యువ క్రికెటర్‌‌కి సలహాలు చెప్పే అర్హత నాకు ఉంది. కపిల్ దేవ్, నాకు ఏదైనా సలహా ఇస్తే నేను సాదరంగా స్వీకరిస్తాను. ఆయన ఈ విషయాలపై ఫోకస్ పెట్టు, దీన్ని వదిలేయ్ అంటే తప్పకుండా పాటిస్తాను. ఎందుకంటే సీనియర్ చెప్పే సలహాలు నా ఆటను మెరుగుపరుస్తాయి...
 

46
Image credit: PTI

ఫుట్ మూమెంట్‌, బ్యాట్ మూమెంట్‌తో పాటు బంతి వేయడానికి ముందే అది ఎక్కడ పడుతుందో అంచనా వేయడం వంటి విషయాలు ఎంతో అనుభవం ఉన్నవారికే తెలుస్తాయి. వారి నుంచి ఆ విషయాలు తెలుసుకోవడంలో తప్పు లేదు. అదే నేను హార్ధిక్ పాండ్యాకి చెప్పాలనుకున్నా...

56

నేను కూడా మాజీ ఆల్‌రౌండర్‌నే. కానీ జనాలు, నా మాటలను తప్పుబడుతున్నారు. హార్ధిక్ పాండ్యా కంప్లీట్ ఆల్‌రౌండర్ అందులో డౌట్ లేదు. కానీ ఎవ్వరూ కూడా 100 శాతం పర్ఫెక్ట్ కాదు. ప్రతీ ఒక్కరికీ కొన్ని మెరుగుపర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి...
 

66
Abdul Razzaq

నాకు కొన్ని విషయాలు తెలీదు. అలాగే వసీం అక్రమ్‌కి కొన్ని ఏరియాల్లో వీక్‌నెస్ ఉండేది. ఇమ్రాన్ ఖాన్ కూడా కొన్ని డెలివరీలు ఆడేందుకు ఇబ్బందిపడేవారు. కపిల్ దేవ్ కూడా అంతే.. ఈనాడు వాళ్లందరినీ మనం క్రికెట్ లెజెండ్స్‌గా గుర్తిస్తున్నాం.. ’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్.. 

click me!

Recommended Stories