అన్నీ అపశకనములే.. లక్నోపై ముంబైకి చెత్త రికార్డు.. మరి ఎలిమినేటర్‌లో అయినా..!

Published : May 24, 2023, 04:59 PM ISTUpdated : May 24, 2023, 05:02 PM IST

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ ఎలిమిటనేటర్ లో మాత్రం బోల్తా కొడుతున్నది.  

PREV
17
అన్నీ అపశకనములే.. లక్నోపై ముంబైకి చెత్త రికార్డు.. మరి ఎలిమినేటర్‌లో అయినా..!

ఐపీఎల్ -16 లో ఫస్ట్ క్వాలిఫయర్ ముగిసింది.   చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య  సోమవారం  రాత్రి ముగిసిన మ్యాచ్ లో   ధోని సేన..  డిఫెండింగ్ ఛాంపియన్స్ ను 15 పరుగుల తేడాతో ఓడించింది.  నేడు ప్లేఆఫ్స్ లో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. 

27
Image credit: PTI

ఎలిమినేటర్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్.. కృనాల్ పాండ్యా  నేతృత్వంలోని  లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతున్నది.  ఈ మ్యాచ్  లో గెలిచిన జట్టు  రెండో క్వాలిఫయర్ ఆడే అవకాశం దక్కనుండగా  ఓడిన జట్టు  బ్యాగ్ సర్దుకోవాల్సిందే. 

37
Image credit: Sandeep Rana

అయితే ఎలిమినేటర్  దశలో ముంబైకి  చెత్త రికార్డు ఉంది.  రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై.. ఇప్పటివరకు   ఏడు సార్లు  ప్లేఆఫ్స్ కు అర్హత సాధించగా అందులో  ఐదు సార్లు  కప్ కొట్టింది.   కానీ  అంతకుముందు కూడా పలుమార్లు   ప్లేఆఫ్స్, ఫైనల్స్ ఆడినా ఆ జట్టుకు అంతగా కలిసిరాలేదు.

47
Image credit: PTI

2011లో  ముంబై ఇండియన్స్.. ఎలిమినేటర్  మ్యాచ్ లో  కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడింది.  వాంఖెడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో  ముంబై గెలిచినా తర్వాత ఫైనల్ చేరలేకపోయింది. ఈ సీజన్ లో  చెన్నై కప్ కొట్టింది.

57

ఆ తర్వాత 2012, 2014లలో  కూడా చెన్నై సూపర్ కింగ్స్ లో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన ముంబై..  రెండు సార్లూ ఓడింది. మరి ఇప్పుడు  మరోసారి ఎలిమినేటర్ ఆడుతున్న ముంబైకి ఇప్పుడు చెన్నై గండం లేకున్నా లక్నో  రూపంలో ముప్పు ఉంది. 

67

గత సీజన్ లో ఐపీఎల్ కు ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ తో  ముంబై ఇప్పటివరకూ మూడు  మ్యాచ్ లు ఆడింది. గత సీజన్ లో రెండు మ్యాచ్ లు, ఈసీజన్ లో ఒక మ్యాచ్ ఆడింది. ఈ  మూడింటిలోనూ లక్నో చేతిలో ముంబైకి పరాజయమే ఎదురైంది.  

77
Image credit: PTI

వీటితో పాటు  చెపాక్ లో కూడా ముంబైకి గొప్ప రికార్డేమీ లేదు.  ఇప్పటివరకూ ఇక్కడ 14 మ్యాచ్ లు ఆడిన  ముంబై.. ఏడు మ్యాచ్ లలో గెలిచి ఏడింటిలో ఓడింది. ఈ సీజన్ లో  చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా రోహిత్ సేనకు ఓటమి తప్పలేదు. ఇక్కడ జరిగిన రెండు ప్లేఆఫ్స్ మ్యాచ్ లలో మాత్రం ముంబైదే విజయం కావడం గమనార్హం. 

click me!

Recommended Stories