అతను ఏ టీమ్‌లో కూడా ఆడలేడు! ఆడించడమే వేస్ట్... మనీశ్ పాండేపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు...

Published : Apr 22, 2023, 01:35 PM IST

ఐపీఎల్‌ చరిత్రలో సెంచరీ చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్ మనీశ్ పాండే. కొన్నాళ్ల పాటు టీమిండియాకి గోల్డెన్ హ్యాండ్‌గా వెలుగొందిన మనీశ్ పాండే, 2022కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఏటా రూ.11 కోట్లు తీసుకున్నాడు. అయితే అందులో సగం పర్ఫామెన్స్ కూడా ఇచ్చింది లేదు...

PREV
17
అతను ఏ టీమ్‌లో కూడా ఆడలేడు! ఆడించడమే వేస్ట్... మనీశ్ పాండేపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు...

ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో ఉన్న మనీశ్ పాండే, తన ఆట మాత్రం మార్చుకోలేదు. వరుసగా మొదటి 5 మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చచ్చీ చెడి 20వ ఓవర్‌లో ఛేదించింది. ఇంకొక్క వికెట్ పడి ఉంటే ఈ మ్యాచ్ కూడా అస్సామే అయ్యుండేది...

27

కెప్టెన్ డేవిడ్ వార్నర్ 41 బంతుల్లో 11 ఫోర్లతో 57 పరుగులు చేయగా మిగిలిన 70 పరుగులు చేసేందుకు మిగతా టీమ్ ప్లేయర్లు నానా తంటాలు పడ్డారు. మనీశ్ పాండే 23 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసి అవుట్ కాగా అక్షర్ పటేల్ 19 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు...
 

37

ఈ మ్యాచ్‌ సమయంలో కామెంటేటర్‌గా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్, మనీశ్ పాండే గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘మనీశ్ పాండే గురించి ఏదైనా చెప్పండి.. ఇంత లో స్కోరింగ్ గేమ్‌లో కూడా అతను ఆడలేక...’ అంటూ శ్రీకాంత్‌ని అడగబోయాడు టీవీ ప్రెజెంటర్...

47

‘మనీశ్ పాండే గురించి ఎందుకు మాట్లాడతారు? అతని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నిజానికి అతనికి టీమ్‌లో చోటు ఇవ్వడమే పెద్ద తప్పు. అతని కంటే అక్షర్ పటేల్ గురించి మాట్లాడుకుందాం. డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడుకుందాం... 

57

మనీశ్ పాండే ప్లేస్‌లో అక్షర్ పటేల్‌కి బ్యాటింగ్ ప్రమోషన్ ఇవ్వాల్సింది... నేను సెలక్టర్‌గా ఉండి ఉంటే మనీశ్ పాండే ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా చూసేవాడిని. అతని గురించి మాట్లాడడం నాకు అస్సలు ఇష్టం లేదు. 

67

ఇంత అనుభవం, అంతర్జాతీయ మ్యాచులు ఆడిన తర్వాత కూడా ఇప్పటిక అలాగే ఆడుతున్నాడు. చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తున్నాడు. ఏళ్లు గడుస్తున్నా అతని ఆటలో ఎలాంటి ఇంప్రూమెంట్ లేదు...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు కృష్ణమాచారి శ్రీకాంత్.

77

ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శనతో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పూణే వారియర్స్, కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నోసూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్... ఇలా ఏడు టీమ్స్ మారాడు మనీశ్ పాండే... 2008 నుంచి ఐపీఎల్ ఆడుతూ ఎక్కువ టీమ్స్‌కి ఆడిన భారత ప్లేయర్‌గా నిలిచాడు మనీశ్ పాండే.. 

click me!

Recommended Stories