చెత్త రికార్డును నమోదుచేసిన దినేశ్ కార్తీక్.. సున్నాలు చుట్టడంలో ఇద్దరూ ఇద్దరే..

Published : Apr 15, 2023, 09:56 PM IST

IPL 2023: గత సీజన్ లో  ఆర్సీబీ తరఫున  మెరుపులు మెరిపించిన ఈ  ఏడాది మాత్రం విఫలమవుతున్నాడు. 2023లో కార్తీక్.. నాలుగు మ్యాచ్ లలో నాలుగు ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ కు  వచ్చి పది పరుగులే చేశాడు. 

PREV
16
చెత్త రికార్డును నమోదుచేసిన దినేశ్ కార్తీక్.. సున్నాలు చుట్టడంలో ఇద్దరూ ఇద్దరే..

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ వైఫల్యల పరంపర కొనసాగుతోంది.  ఢిల్లీ  క్యాపిటల్స్ తో మ్యాచ్ లో  డీకే.. గోల్డెన్   డకౌట్ అయ్యాడు. తద్వారా ఐపీఎల్ లో ఓ చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ లో అత్యధికసార్లు డకౌట్ అయిన  బ్యాటర్లలో  అగ్రస్థానంలో నిలిచాడు. 

26

ఆర్సీబీ - ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో   కుల్దీప్ యాదవ్ వేసిన 15వ ఓవర్లో   ఫస్ట్ బాల్ గ్లెన్ మ్యాక్స్‌వెల్  ఔటయ్యాడు.  అతడి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన దినేశ్ కార్తీక్.. ఎదుర్కున్న  తొలి బంతికే  భారీ షాట్ ఆడబోయి   లలిత్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. 

36

తద్వారా ఐపీఎల్ లో అత్యధికసార్లు డకౌట్ అయిన  మన్‌దీప్ సింగ్  (కేకేఆర్) తో   సమంగా  నిలిచాడు.  మన్‌దీప్  ఐపీఎల్ లో ఏకంగా 15  సార్లు డకౌట్ అయ్యాడు.  ఈ జాబితాలో  మన్‌దీప్  తర్వాత  దినేశ్ కార్తీక్ కూడా 15 సార్లు  సున్నాలు  చుట్టాడు.  

46
Image credit: PTI

మన్‌దీప్, దినేశ్ కార్తీక్ తర్వాత  టీమిండియా సారథి, ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న  రోహిత్ శర్మ.. ఐపీఎల్ లో 14 సార్లు డకౌట్ అయ్యాడు.   రోహిత్ తో పాటు  కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ కూడా 14 సార్లు సున్నాకే ఔట్ అయ్యాడు. 
 

56

కాగా  గత సీజన్ లో  ఆర్సీబీ తరఫున  మెరుపులు మెరిపించిన ఈ  ఏడాది మాత్రం విఫలమవుతున్నాడు. 2023లో కార్తీక్.. నాలుగు మ్యాచ్ లలో నాలుగు ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ కు దిగాడు.  ముంబైతో మ్యాచ్ లో డకౌట్ అవగా  కోల్కతాతో 9, లక్నోతో 1, ఢిల్లీతో  మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. 

66

ఐపీఎల్ లో 2008 నుంచి ఆడుతున్న దినేశ్ కార్తీక్  ఇప్పటివరకు  233 మ్యాచ్‌లు ఆడి   212 ఇన్నింగ్స్ లలో  4,386 పరుగులు చేశాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్, గుజరాత్ లయన్స్, పంజాబ్, కేకేఆర్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ తరఫున ఆడిన కార్తీక్.. ఇదే ఆట కొనసాగిస్తే వచ్చే సీజన్ లో  బెంగళూరు తరఫున ఆడేది కూడా అనుమానమే. ఇక అతడు కామెంటరీకే పరిమితం కాక తప్పదు.  

click me!

Recommended Stories