టీమిండియా కొత్త కిట్ స్పాన్సర్‌గా అడిడాస్.. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచే కొత్త కిట్‌లో...

First Published May 23, 2023, 5:55 PM IST

భారత క్రికెట్ జట్టు కొత్త కిట్ స్పాన్సర్‌గా అడిడాస్‌ని ప్రకటించింది బీసీసీఐ. గ్లోబర్ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ అడిడాస్, భారత పురుషుల జట్టుతో పాటు మహిళల టీమ్‌కి, అండర్19 జట్టుకి కూడా కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది...

Image credit: BCCIAdidas

మే 2023 నుంచి మార్చి 2028 వరకూ ఐదేళ్ల పాటు భారత క్రికెట్ టీమ్‌కి స్పాన్సర్‌గా ఉంటుంది అడిడాస్. మూడు ఫార్మాట్లలో భారత కిట్‌ తయారీ హక్కులను సొంతం చేసుకున్న అడిడాస్, భారత క్రికెట్ జెర్సీలతో పాటు ట్రైయినింగ్, ట్రావెల్ వేర్‌లను కూడా సరాఫరా చేయనుంది..

జూన్ మొదటి వారంలో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచి అడిడాస్ కొత్త కిట్‌లో కనిపించబోతోంది భారత జట్టు. ఇప్పటికే అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ ఈ కొత్త ట్రావెల్ జెర్సీల్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..
 

‘క్రికెట్‌కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు వరల్డ్ లీడింగ్ స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ అడిడాస్‌తో ఒప్పందం ఉపయోగపడుతుంది. క్రీడాల్లో ఎంతో ఘనమైన చరిత్ర, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్.... భారత క్రికెట్‌ అభివృద్ధికి వివిధ విభాగాల్లో కీలక పాత్ర పోషిస్తుందని  భావిస్తున్నాం...’ అంటూ తెలియచేశాడు బీసీసీసఐ సెక్రటరీ జై షా...

2020 నుంచి భారత క్రికెట్ టీమ్‌కి ఎంపీఎల్ కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఎంపీఎల్‌తో కాంట్రాక్ట్ ఈ ఏడాది డిసెంబర్ వరకూ ఉంది. అయితే అర్ధాంతరంగా ఈ కాంట్రాక్ట్‌ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది ఎంపీఎల్...

భారత క్రికెట్ కిట్ స్పాన్సర్‌గా ఒక్క మ్యాచ్‌కి రూ.65 లక్షలను బీసీసీఐకి చెల్లించనుంది అడిడాస్. ఏడాదికి దాదాపు రూ.70 కోట్లు, ఐదేళ్లకు రూ.350 కోట్లు ఈ ఒప్పందం ప్రకారం బీసీసీఐ ఖాతాలో చేరబోతున్నాయి...  

click me!