అంత స్కోరు కొట్టాక ఆ మాత్రం క్యాచ్‌లు డ్రాప్ చేయకపోతే ఎలా... పృథ్వీ షా కామెంట్స్...

Published : May 18, 2023, 04:30 PM IST

ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందు అందరి దృష్టిని ఆకర్షించిన బ్యాటర్ పృథ్వీ షా. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అయితే మా పృథ్వీ షా ఈసారి ఆరెంజ్ క్యాప్ గెలుస్తాడని నమ్మకంగా చెప్పాడు..  

PREV
16
అంత స్కోరు కొట్టాక ఆ మాత్రం క్యాచ్‌లు డ్రాప్ చేయకపోతే ఎలా... పృథ్వీ షా కామెంట్స్...

మొదటి 6 మ్యాచుల్లో కలిపి 47 పరుగులే చేసిన పృథ్వీ షా, టీమ్‌లో చోటు కూడా కోల్పోయాడు. ప్లేఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తప్పుకున్నాక మళ్లీ పృథ్వీ షాకి తుది జట్టులో చోటు దక్కింది...
 

26

రీఎంట్రీ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన పృథ్వ షా, ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. డేవిడ్ వార్నర్ మెరుపులతో తోడు రిలే రసో, ఫిలిప్ సాల్ట్ బాదుడుకి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 213 పరుగుల భారీ స్కోరు చేసింది...
 

36

ఈ లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ 15 పరుగుల తేడాతో ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డర్లు ఏకంగా 6 క్యాచ్‌లను డ్రాప్ చేయగా రెండు రనౌట్లు మిస్ అయ్యాయి. దీంతో ఢిల్లీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి...
 

46
PTI Photo/Vijay Verma)(PTI04_01_2023_000337B)

‘ఈ వికెట్ ఫాస్ట్ బౌలర్లకు ఏ మాత్రం సహకరించడం లేదు, స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. భారీ స్కోరింగ్ గేమ్‌లో డ్రాప్ క్యాచులు సర్వ సాధారణం. 213 పరుగుల కొండంత స్కోరు చేశామనే ధీమా ఫీల్డర్లలో పెరిగితే క్యాచ్‌లు డ్రాప్ అవుతాయి...

56

ఈ రోజు మ్యాచ్‌ని పూర్తిగా ఎంజాయ్ చేశాను. ప్రతిదీ కలిసి వచ్చింది. అందరూ నవ్వుతున్నారు. ఇలాంటి వాతావరణం ఉంటే మ్యాచులు గెలవడం పెద్ద కష్టమేమీ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ పృథ్వీ షా...
 

66

ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభం నుంచి పృథ్వీ షా బ్యాటు నుంచి ఇలాంటి ప్రదర్శన వచ్చి ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ బెటర్ పొజిషన్‌లో ఉండేది. అలాగే అతనికి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే అవకాశం కూడా వచ్చి ఉండేది...  

click me!

Recommended Stories