ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా రికార్డుల పుస్తకాలు రాస్తే, అందులో ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మల కోసం సెపరేట్ పేజీలు లిఖించాల్సిందే. అసాధ్యమైన రికార్డులెన్నో క్రియేట్ చేసిన ఈ ఇద్దరూ... ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు చెత్త రికార్డులను తన ఖాతాలో వేసుకోబోతున్నారు...
ఐపీఎల్‌లో 6 వేలకు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఈ ఫీట్ సాధించిన ఏకైక బ్యాటర్‌గా ఉన్నాడు. అత్యధిక సార్లు బౌల్డ్ అయిన ప్లేయర్లలోనూ టాప్ 2లో ఉన్నాడు విరాట్ కోహ్లీ...
26
మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్, తన ఐపీఎల్ కెరీర్‌లో 35 సార్లు బౌల్డ్ అయితే.. విరాట్ కోహ్లీ 34 సార్లు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శిఖర్ ధావన్ కూడా 34 సార్లు ఈ విధంగా అవుటై పెవిలియన్ చేరాడు...
36
ఐపీఎల్ 2022 సీజన్‌లో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీలలో ఒకరు షేన్ వాట్సన్ రికార్డును అధిగమించి... అత్యధిక సార్లు బౌల్డ్ అయిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేయబోతున్నారు...
46
ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్లలో టాప్ 2లో ఉన్నాడు ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ. రోహిత్, ఐపీఎల్‌లో 13 సార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు...
56
అంబటి రాయుడు, తన కెరీర్‌లో 14 సార్లు డకౌట్ కాగా... పియూష్ చావ్లా, హర్భజన్ సింగ్, పార్థివ్ పటేల్, అజింకా రహానే, రోహిత్ శర్మ 13 సార్లు ఈ ఫీట్ సాధించారు... వీరిలో అంబటి రాయుడితో పాటు రహానే, రోహిత్ శర్మ ఈ సీజన్‌లో పాల్గొనబోతున్నారు...
66
అత్యధిక సార్లు సింగిల్ డిజిట్‌కే అవుటైన బ్యాటర్‌గా దినేశ్ కార్తీక్‌తో కలిసి టాప్‌లో ఉన్నాడు రోహిత్ శర్మ. ఈ ఇద్దరూ తమ ఐపీఎల్ కెరీర్‌లో 60 సార్లు, సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు...