IPL: ఐపీఎల్ లో 9 ఫ్రాంచైజీలు మారిన ఆసీస్ క్రికెటర్ ఎవరో తెలుసా..? నువ్వు దేవుడివి సామి..

Published : Mar 22, 2022, 06:07 PM ISTUpdated : Mar 22, 2022, 06:09 PM IST

Aaron Finch: ఆస్ట్రేలియా వన్డే జట్టు సారథి ఐపీఎల్ లో 8 జట్లు మారాడు. ప్రస్తుతం 9వ జట్టులో చేరాడు.  ఒక్కచోట  కూడా కుదురుగా  రెండేండ్లకు మించి ఆడలేదు. దాదాపు అన్ని ఫ్రాంచైజీలు ఓ రౌండ్ వేసుకున్న  అతడి గురించి... 

PREV
17
IPL: ఐపీఎల్ లో 9 ఫ్రాంచైజీలు మారిన ఆసీస్ క్రికెటర్ ఎవరో తెలుసా..? నువ్వు దేవుడివి సామి..

ఐపీఎల్ లో ఒక ఆటగాడు ఒకే జట్టులో ఉండటం చాలా అరుదు. ధోని, కోహ్లి, రోహిత్ శర్మ వంటి కొందరు ఆటగాళ్లు మినహా  టీమిండియాకు చెందిన ప్లేయర్లు కూడా తరుచూ జట్లు మారుతుంటారు. 

27

ఇక విదేశీ ఆటగాళ్ల గురించైతే చెప్పక్కర్లేదు.  సీజన్ సీజన్ కు వాళ్లు మారుతుంటారు. అయితే ఎంత మారినా నాలుగైదు ఫ్రాంచైజీలు మారతారు. కానీ ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ మాత్రం ఏకంగా 8 జట్లు మారాడు. 

37

ఎవరా మహానుభావుడు అనుకుంటున్నారా..? పరిమిత ఓవర్లలో ఆసీస్ కు సారథ్యం వహిస్తున్న  సారథి ఆరోన్ ఫించ్.. గతంలో 8 ఫ్రాంచైజీలు మారిన ఫించ్ ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ కు ఆడుతున్నాడు. ఐపీఎల్ లో ఇది అతడి 9వ ఫ్రాంచైజీ. 

47

ఒకసారి  ఫించ్  ఐపీఎల్ చరిత్రను చూస్తే.. 2010లో  ఈ మెగా లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సీజన్ లో అతడు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. 2011-12 సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) కు ఎంపికయ్యాడు. 

57

2013లో పూణె వారియర్స్  తరఫున ఆడిన ఫించ్.. 2014 లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిథ్యం వహించాడు. ఇక 2015లో ముంబై ఇండియన్స్ కు వెళ్లిన అతడు.. 2016-17లో గుజరాత్ లయన్స్ తరఫున ఆడాడు. 

67

2018 సీజన్ లో కింగ్స్ లెవన్ పంజాబ్ కు ఆడిన ఆసీస్ సారథి.. 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో చేరాడు.  ఇక ఇటీవలే ముగిసిన వేలంలో అతడు అమ్ముడుపోలేదు. కానీ  ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ కు గాయం కావడంతో అతడి స్థానంలో ఫించ్ ను తీసుకున్నారు. 

77

ఈ నేపథ్యంలో  ఓ క్రీడా ఛానెల్ ఫించ్ ను ఇంటర్వ్యూ చేస్తూ.. ‘మీ దగ్గర అన్ని ఫ్రాంచైజీల క్యాపులు, జెర్సీలు ఉన్నాయా..?’ అని ప్రశ్నించింది. దానికి ఫించ్ సమాధానమిస్తూ.. ‘ఒక్క ఫ్రాంచైజీకి చెందిన జెర్సీ మిస్ అయినట్టుంది. కానీ అదేంటో గుర్తు రావడం లేదు..’ అని చెప్పాడు.

click me!

Recommended Stories