రోహిత్ ఎంత కాలం కెప్టెన్‌గా ఉంటాడు, హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వండి... షోయబ్ అక్తర్ సలహా...

Published : May 29, 2022, 08:13 PM IST

విరాట్ కోహ్లీ తర్వాత మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు రోహిత్ శర్మ. అయితే 34 ఏళ్ల వయసులో టీమిండియాని, అదీ మూడు ఫార్మాట్లలో నడిపించడం అంత తేలికయ్యే విషయం కాదు. దీంతో రోహిత్ తర్వాత భారత కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్న రేగింది...

PREV
18
రోహిత్ ఎంత కాలం కెప్టెన్‌గా ఉంటాడు, హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వండి... షోయబ్ అక్తర్ సలహా...

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, భారత జట్టుకి ఐసీసీ టైటిల్ అందిస్తాడని కోట్ల ఆశలు పెట్టుకుంది బీసీసీఐ. అందుకే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగియగానే కెప్టెన్సీ మార్పులు చేసింది...

28
Image Credit: PTI

అయితే రోహిత్ వయసు కారణంగా అతని తర్వాత ఎవరికి కెప్టెన్సీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. సౌతాఫ్రికా టూర్‌కి ముందు గాయం కారణంగా రోహిత్ శర్మ తప్పుకోవడంతో కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు కెఎల్ రాహుల్...

38

ఆ టూర్‌లో ఓ టెస్టు, మూడు వన్డేల్లో భారత జట్టు చిత్తుగా ఓడింది. అయినా ఆ పరాభవం తర్వాత కూడా సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు కెఎల్ రాహుల్...

48

దీంతో భారత జట్టు ఫ్యూచర్ కెప్టెన్‌గా కెఎల్ రాహుల్‌ని బీసీసీఐ పరిగణిస్తోందని సిగ్నల్స్ ఇచ్చేసింది. ఇదే సిరీస్‌కి రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందడంతో, అతను కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నట్టే...

58
Photo source- iplt20.com

అయితే ఈ ఇద్దరి కంటే ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్‌ని ఫైనల్ చేర్చిన హార్ధిక్ పాండ్యా, భారత జట్టు సారథిగా మారితే బాగుంటుందని అంటున్నాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్...

68
Image credit: PTI

‘హార్ధిక్ పాండ్యా తన కెప్టెన్సీతో ఓ మార్కు క్రియేట్ చేస్తున్నాడు. టీమిండియా కెప్టెన్సీ తలుపులను గట్టిగా కొడుతున్నాడు. రోహిత్ శర్మ ఇంకా ఎంత కాలం కెప్టెన్‌గా కొనసాగుతాడు?

78
Photo source- iplt20.com

భారత జట్టుకి కెప్టెన్‌గా చేయడం అంత తేలికయ్యే పని కాదు. అయితే తనలో కెప్టెన్సీ స్కిల్స్ పుష్కలంగా ఉన్నాయని హార్ధిక్ పాండ్యా నిరూపించుకున్నాడు. అయితే హార్ధిక్ పాండ్యా కూడా ఫిట్‌నెస్‌పై పూర్తి ఫోకస్ పెట్టాలి...

88

అతను ఫిట్‌గా ఉండి బౌలింగ్ చేయగలిగితే, కచ్చితంగా భారత జట్టులో చోటు దక్కించుకుంటాడు. కేవలం బ్యాటర్‌గా టీమ్‌లోకి రావాలంటే మాత్రం కష్టం... ఆ ప్లేస్‌ కోసం చాలా మంది ఉన్నారు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్...

Read more Photos on
click me!

Recommended Stories