ఫీల్డ్ క్లియర్ చేసి అటు కొట్టమన్నాడు, కొట్టగానే క్యాచ్ పట్టి ముద్దు పెట్టాడు... దినేశ్ కార్తీక్ కామెంట్

Published : Apr 17, 2022, 12:03 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్రతీ మ్యాచ్‌లోనూ అదరగొడుతూ అటు క్రికెట్ ఫ్యాన్స్‌ని, ఇటు టీమిండియా సెలక్టర్లనీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు భారత సీనియర్ వికెట్ కీపింగ్ బ్యాటర్ దినేశ్ కార్తీక్. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో చోటు దక్కించుకోవడమే టార్గెట్‌గా చెలరేగిపోతున్నాడు ఢీకే...

PREV
110
ఫీల్డ్ క్లియర్ చేసి అటు కొట్టమన్నాడు, కొట్టగానే క్యాచ్ పట్టి ముద్దు పెట్టాడు... దినేశ్ కార్తీక్ కామెంట్

ఐపీఎల్ 2022 సీజన్‌లో 6 మ్యాచులు ఆడిన దినేశ్ కార్తీక్, 6 ఇన్నింగ్స్‌లో 197 సగటుతో, 209+ స్ట్రైయిక్ రేటుతో 197 పరుగులు చేశాడు...

210

ఆరు మ్యాచుల్లో కలిపి ఒకే ఒక్క మ్యాచ్‌లో అవుట్ అయిన దినేశ్ కార్తీక్, రెండు సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచాడు...

310

ఐపీఎల్ 2022 సీజన్‌లో భారత సీనియర్లు ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌లతో సమానంగా రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన ప్లేయర్ల జాబితాలో ఉన్నాడు కార్తీక్...

410

2004లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన దినేశ్ కార్తీక్, ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్‌ బౌలింగ్‌ని మొదటిసారి ఎదుర్కొన్న సందర్భాన్ని గుర్త చేసుకున్నాడు...
 

510

‘ఆయన వ్యక్తిత్వాన్ని మాటల్లో వర్ణించలేం. ఆయనతో ఆడిన ప్రతీ ప్లేయర్ ఆఫ్ ఫీల్డ్, ఆన్ ఫీల్డ్ వార్న్ చేసిన అడ్వెంచర్స్ గురించే మాట్లాడతారు... ఆయనది ఓ కలర్‌ఫుల్ పర్సనాలిటీ...

610

షేన్ వార్న్‌ది చాలా గొప్ప క్యారెక్టర్. ఆయన స్కిల్స్‌కి అసంఖ్యాక అభిమానులు ఉన్నారు. ప్రత్యేకమైన విషయాలు చేయడం వార్న్ స్పెషాలిటీ...

710

2009 ఐపీఎల్ కోసం సౌతాఫ్రికా వెళ్లాం. నేను బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు వార్న్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆయన నాతో ‘హే యంగ్‌స్టర్... నీ టాలెంట్ ఏంటో చూద్దాం...’  అన్నారు...

810

నేను అప్పుడు యువకుడిని. ఉడుకు రక్తం. ఆయనికి ‘ఒకే’ అని సమాధానం చెప్పి బ్యాటింగ్‌కి వెళ్లాను. స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడం నాకేమీ పెద్దగా ఇబ్బంది అనిపించదు..

910

నాకు ఫీల్డ్ క్లియర్ చేసిన వార్న్, అక్కడ షాట్ కొట్టు చూద్దాం... అన్నారు. నేను పౌరుషంగా షాట్ ఆడబోయాను. అది ఎడ్జ్ తీసుకుని ఆయన చేతుల్లోకి వెళ్లి వాలింది...

1010

ఆయన క్యాచ్ పట్టుకుని, బాల్‌కి ముద్దు పెట్టి... ‘బై బై ... సీ యూ’ అన్నారు. ఆ సంఘటన నాకు ఇప్పటికీ నిన్నే జరిగినట్టుగా అనిపిస్తుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు దినేశ్ కార్తీక్..

Read more Photos on
click me!

Recommended Stories