IPL 2022: భారత క్రికెట్ కు కాసుల పంట పండిస్తున్న ఐపీఎల్ పుణ్యమా అని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కు వద్దన్నా ఆదాయం వచ్చి చేరుతున్నది. వివిధ మార్గాల ద్వారా ఈ ఐపీఎల్ లో కూడా...
ప్రపంచంలోని అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుగా గుర్తింపు పొందిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదాయం రాను రాను పెరుగుతుందే తప్ప ఇసుమంతైనా తగ్గడం లేదు.
211
ఏది ముట్టుకున్నా బీసీసీఐకి కలిసివస్తున్నది. ఐపీఎల్ పుణ్యమా అని బీసీసీఐకి కాసుల పంట పండుతున్నది. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ నానాటికీ పెరుగుతుండటం.. దాని పరిధి నానాటికీ పెరుగుతుండటంతో బీసీసీఐకి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చిపడుతున్నది.
311
ఇప్పటికే ప్రసార హక్కులు, ఫ్రాంచైజీలు, ఇతర మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్న బీసీసీఐ.. ఐపీఎల్ కు స్పాన్సర్లు గా వ్యవహరిస్తున్న వారి నుంచి కూడా భారీగా ఆదాయం పొందుతున్నది.
411
ఈ ఏడాది రెండు కొత్త జట్లు (లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్) ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తుండటంతో స్పాన్సర్లు కూడా ఈ క్యాష్ రిచ్ లీగ్ కు భారీగా పెరిగారు.
511
ఐపీఎల్-2022 కు ఇప్పటికే తొమ్మిది సంస్థలు స్పాన్సర్షిప్స్ చేస్తున్నాయి. వీటి ద్వారా రూ. 800 కోట్ల ఆదాయం పొందుతున్నది బీసీసీఐ. ఐపీఎల్ లో ఈ ఏడాది 6 స్పాన్సర్స్.. అఫిషియల్ పార్ట్నర్స్ గా వ్యవహరించబోతున్నాయి.
611
గతంలో ఉన్న వివో.. టైటిల్ స్పాన్సర్స్ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో టాటా వచ్చి చేరింది. ఇక ఇటీవలే స్విగ్గీ, రూపే లు ఐపీఎల్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ఏ స్పాన్సర్ తో ఐపీఎల్ ఒప్పందం ఎంత మేరకు కుదుర్చుకుందో ఓసారి లెక్కెస్తే..
711
ఐపీఎల్ 2022 సెంట్రల్ కాంట్రాక్టులు : 1. టాటా ఐపీఎల్ స్పాన్సర్.. రూ. 355 కోట్లు + ఎగ్జిట్ ఫీజులు + వివో నుంచి రావాల్సిన మొత్తం (మొత్తంగా రూ. 200 కోట్లు)
811
2. డ్రీమ్ 11 : అఫిషియల్ పార్ట్నర్.. విలువ : రూ. 48 కోట్లు. 3. అన్ అకాడమీ : అఫిషియల్ పార్ట్నర్.. విలువ రూ. 46 కోట్లు. 4. క్రెడ్ : అఫిషియల్ పార్ట్నర్.. విలువ : రూ. 44 కోట్లు
911
5. అప్స్టాక్స్ : అఫిషియల్ పార్ట్నర్.. విలువ : రూ.44 కోట్లు. 6. రూపే : అఫిషియల్ పార్ట్నర్.. విలువ : రూ. 42 కోట్లు. 7. స్విగ్గీ ఇన్స్టామార్ట్ : అఫిషియల్ పార్ట్నర్.. విలువ : రూ. 42 కోట్లు
1011
8. పేటీఎం : అఫిషియల్ అంపైర్ పార్ట్నర్.. విలువ : రూ. 28 కోట్లు. 9. సీయట్ : అఫిషియల్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్ట్నర్.. విలువ : రూ. 28 కోట్లు..
1111
గతంతో పోల్చితే ఈసారి ఐపీఎల్ కు స్పాన్సర్లు పెరగడం.. టైటిల్ స్పాన్సర్షిప్ డీల్ నుంచి వివో తప్పుకుని ఆ స్థానంలో టాటా రావడంతో బీసీసీఐకి ఈ ఏడాది కాసుల పంట పండింది.