ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు మహేంద్ర సింగ్ ధోనీ. అయితే లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీయే రియల్ కెప్టెన్‌గా కనిపించాడు...
ఇప్పుడే కాదు, 2007 తర్వాత మాహీ ఏ టీమ్‌లో ఉన్నా, అతనే అసలైన కెప్టెన్ అనిపించేలా వ్యవహరిస్తూ ఉంటాడు. మాహీ కారణంగా విరాట్ కోహ్లీ, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ఆన్ పేపర్ కెప్టెన్లుగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
212
ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ నయా సారథి రవీంద్ర జడేజా కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. నిజానికి కెప్టెన్సీ అనుభవం లేని జడ్డూ, మాహీ ఆన్ ఫీల్డ్ కెప్టెన్సీతో విమర్శలు మాత్రమే కాదు, పరాజయాలను చవిచూడాల్సి వస్తోంది.
312
Jadeja-Dhoni
ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన తొలి రెండు మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది. సీఎస్‌కే, మొదటి రెండు మ్యాచుల్లో ఓడడం ఇదే తొలిసారి...
412
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 210 పరుగుల భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేక ఓటమిపాలైంది సీఎస్‌కే... అయితే ఈ లక్ష్యఛేదనలో బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ సెట్టింగ్స్ వంటి నిర్ణయాలన్నీ ధోనీయే చూసుకున్నాడు...
512
మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసే 19వ ఓవర్‌ని శివమ్ దూబేకి ఇవ్వడంతో పాటు ఆఖరి ఓవర్ ముఖేశ్ చౌదరితో వేయించాలని డిసైడ్ చేసింది కూడా మాహీయే...
612
మాహీ ఆన్ ఫీల్డ్ కెప్టెన్సీ చేస్తుండడంతో రవీంద్ర జడేజా కేవలం ఆన్ పేపర్ కెప్టెన్‌గా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. ధోనీ చేసిన పనిని తప్పుబట్టాడు భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా...
712
‘నేను ఎమ్మెస్ ధోనీకి చాలా పెద్ద అభిమానిని. అయితే మాహీ చేసింది తప్పు. ధోనీ టెంపర్‌మెంట్ మ్యాచ్‌ను కంట్రోల్ చేస్తుంది. కానీ కెప్టెన్ కానప్పుడు అనవసర విషయాల్లో వేలు పెట్టకూడదు...
812
ఒకవేళ ప్లేఆఫ్స్‌కి వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మాహీ ఇలా చేసి ఉంటే, అర్థం చేసుకునేవాడిని. కానీ ఇది కేవలం రెండో మ్యాచ్ మాత్రమే...
912
Ravindra Jadeja
రవీంద్ర జడేజా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు అతనికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి. నిర్ణయాలు తీసుకునే అధికారం ఇవ్వాలి. ఎమ్మెస్ ధోనీ చాలా పెద్ద స్టార్...
1012
Dhoni-Jadeja
అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎన్నో టోర్నీలు గెలిపించాడు, కాదనను. ఎమ్మెస్ ధోనీ కంటే బెటర్ కెప్టెన్‌ని నేనెప్పుడూ చూడలేదు కూదా...
1112
Jadeja
అయితే ఒక్కసారి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆ పొజిషన్‌ని మరొకరు తీసుకున్నాక... అందులో జోక్యం చేసుకోవడం అనవసరం. ఇలా చేస్తే జడేజా ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది...
1212
జడేజాకి ఇప్పటికే 14 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలెట్టిన క్రికెటర్ కాదు కదా... ఆ విషయాన్ని మాహీ అర్థం చేసుకుంటే బెటర్...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా...