ఇప్పటికే హంకాంగ్, సింగపూర్, బ్రిటన్ వంటి దేశాలు భారత విమాన రాకపోకలను పూర్తిగా నిషేధించాయి. ఆస్ట్రేలియా కూడా ఆ దిశగా ఆలోచనలు చేస్తోంది... దీంతో ఐపీఎల్‌లో పాల్గొంటున్న క్రికెటర్లు, స్వదేశానికి పయనం కానున్నారు.
ప్రస్తుతం ఐపీఎల్ 2021 సీజన్‌లో అత్యధికంగా 12 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు పాల్గొంటున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌లో స్టీవ్ స్మిత్, ఆర్‌సీబీలో గ్లెన్ మ్యాక్స్‌వెల్, క్రిస్టియన్, కేకేఆర్‌లో ప్యాట్ కమ్మిన్స్, ముంబై ఇండియన్స్‌లో క్రిస్‌లీన్ ఉన్నారు.
ప్లేయర్లు మాత్రమే కాకుండా కోచ్‌లుగా వ్యవహారిస్తున్న రికీ పాంటింగ్, టామ్ మూడీ వంటి మాజీ క్రికెటర్లు కూడా ఐపీఎల్‌లో పాల్గొంటున్నారు...
వీరితో పాటు ఇప్పటికే కరోనా భయంతో ఆండ్రూ టై, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా వంటి ప్లేయర్లు స్వదేశంలో వాలిపోయారు. దీంతో మిగిలిన వారికి మే 15లోగా స్వదేశానికి రావాల్సిందిగా డెడ్‌లైన్ విధించింది ఆస్ట్రేలియా...
మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ జరగాల్సి ఉంది. ఆసీస్ క్రికెటర్లు వెళ్లిపోతే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లపై పెద్దగా ప్రభావం పడదు. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఆర్‌సీబీ జట్లు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో డేవిడ్ వార్నర్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అసలే మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో ఎన్నో కష్టాలు పడుతున్న ఆరెంజ్ ఆర్మీ, వార్నర్ భాయ్ కూడా వెళ్లిపోతే చాలా బలహీన జట్టుగా మారిపోతుంది.