లాక్‌డౌన్ కారణంగా సెలబ్రిటీ కపుల్స్... పనులన్నీ మానేసి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంకేముంది లేకలేక దొరికిన ఖాళీ టైమ్‌ను పర్ఫెక్ట్‌గా వాడేసుకున్నారు చాలామంది. దీంతో ఇప్పటికే విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ, హార్దిక్ పాండ్యా- నటాశా, కరీనా కపూర్ - సైఫ్ ఆలీఖాన్ వంటి వాళ్లు త్వరలో తల్లిదండ్రులుగా మారబోతున్నట్టు గుడ్ న్యూస్ చెప్పేశారు. తాజాగా ఈ లిస్టులోకి జహీర్ ఖాన్- సాగరిక జంట కూడా చేరినట్టు టాక్.