IPL 2020: ఫ్లేఆఫ్ చేరే నాలుగు జట్లు ఇవే... అజిత్ అగార్కర్ జోస్యం...

First Published Oct 14, 2020, 6:30 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో సగం మ్యాచులు అయిపోయాయి. ఎప్పుడూ లేనట్టుగా ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములు ఎదుర్కోగా, యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలతో అదరగొడుతోంది. ఈసారి ప్లేఆఫ్ చేరే జట్లు ఇవే అంటున్నాడు మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్.

పేసర్‌గా మంచి రికార్డు ఉన్న అజిత్ అగార్కర్, వన్డేల్లో భారత జట్టు తరుపున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన క్రికెటర్‌గా ఉన్నాడు. 2000 సంవత్సరంలో జింబాబ్వేపై 21 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు అజిత్ అగార్కర్.
undefined
మళ్లీ ముంబై పక్కా: నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఈసారి కూడా మంచి ఆటతీరు ప్రదర్శిస్తోంది. ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో కూడాప్లేఆఫ్ చేరుతుందని అంటున్నాడు అజిత్ అగార్కర్.
undefined
యువ ఢిల్లీ అదరహో: అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్న యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్, ఇప్పటిదాకా ఏడు మ్యాచుల్లో 5 విజయాలు అందుకుంది. ఢిల్లీ ఈసారి కచ్ఛితంగా ప్లేఆఫ్స్ చేరుతుందని అంటున్నాడు అజిత్ అగార్కర్.
undefined
కోల్‌కత్తా ‘ఖతర్నాక్’: రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, 7 మ్యాచుల్లో నాలుగు విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కేకేఆర్ ఇలాగే విజయాలు అందుకుంటూ ప్లేఆఫ్స్ చేరుతుందని అంచనా వేస్తున్నాడు అజిత్ అగార్కర్.
undefined
సన్‌ ‘రైజింగ్’: ముంబై, ఢిల్లీ, కేకేఆర్ కాకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట బాగుందన్న అజిత్ అగార్కర్, ఈసారి ఎస్ఆర్‌హెచ్ ప్లేఆఫ్ చేరుతుందని అంటున్నాడు.
undefined
రాజస్థాన్ ‘రాయల్’ఎంట్రీ: ఏడు మ్యాచుల్లో కేవలం 3 విజయాలే అందుకున్న రాజస్థాన్ రాయల్స్, ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. ప్లేఆఫ్ ప్లేస్ కోసం రాజస్థాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య పోటీ ఉంటుందని అంటున్నాడు అజిత్ అగార్కర్.
undefined
కోహ్లీ టీమ్‌కి నో ఛాన్స్: మొదటి సగంలో ఏడు మ్యాచుల్లో 5 విజయాలు అందుకుని మూడో స్థానంలో ఉన్న కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై తనకు నమ్మకం లేదంటున్నాడు అజిత్ అగార్కర్. విజయాలు అందుకుంటున్నా, ప్లేఆఫ్ చేరడం కష్టమేనంటున్నాడు అజిత్ అగార్కర్.
undefined
చెన్నై అసాధ్యం: ఏడు మ్యాచుల్లో 3 విజయాలు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, పాయింట్ల పట్టికలో కింది నుంచి మూడో స్థానంలో ఉంది. ధోనీ కెప్టెన్సీ మ్యాజిక్ పనిచేసినా, ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యమని అంటున్నాడు అజిత్ అగార్కర్.
undefined
పంజాబ్ ఫెయిల్యూర్: సీజన్ ఇప్పటిదాకా ఆడిన ఏడు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం అందుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, దాదాపు ప్లేఆఫ్ ఆశలను ఆవిరి చేసుకుంది. పంజాబ్ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇకపై జరిగే మ్యాచులన్నీ గెలవాల్సి ఉంటుంది. అలాగే రాజస్థాన్, చెన్నై, హైదరాబాద్ జట్లు ఓడిపోవాల్సి ఉంటుంది.
undefined
click me!