IPL 2020: ఈ కెప్టెన్లను కూడా మార్చేయండి... కెప్టెన్సీల మార్పుపై కొత్త డిమాండ్లు...

First Published Oct 16, 2020, 6:42 PM IST

IPL 2020 సీజన్‌ మధ్యలో కెప్టెన్‌ను మార్చి, సంచలన నిర్ణయం తీసుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలు అందించినా, దినేశ్ కార్తీక్‌ను పక్కబెట్టి, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను కేకేఆర్‌కి కొత్త కెప్టెన్‌గా నియమించింది. దీంతో అనూహ్యంగా మిగిలిన జట్ల కెప్టెన్లను మార్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

సన్‌రైజర్స్: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు ఎస్ఆర్‌హెచ్ అభిమానులు...
undefined
గత సీజన్‌లో అద్భుతంగా రాణించిన డేవిడ్ వార్నర్, ఈ సీజన్‌లో కెప్టెన్సీ బాధ్యతల కారణంగా సరిగా రాణించలేకపోతున్నాడు...
undefined
అయితే 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి టైటిల్ అందించాడు డేవిడ్ వార్నర్...
undefined
డేవిడ్ వార్నర్ స్థానంలో మళ్లీ కేన్ విలియంసన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అందించాలని కోరుతున్నారు... అయితే ఈ సీజన్‌లో ఇప్పటిదాకాపెద్దగా రాణించకపోయినా, డేవిడ్ వార్నర్ సెకండాఫ్‌లో అదరగొడతాడని అంటున్నాడు వార్నర్ భాయ్ అభిమానులు...
undefined
మరోవైపు బెంగళూరు గత మ్యాచ్‌లో ఓడిపోవడానికి కోహ్లీ చెత్త కెప్టెన్సీయే కారణమంటున్నారు కొందరు నెటిజన్లు.
undefined
మంచి ఫామ్‌లో ఉన్న ఏబీ డివిల్లియర్స్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి దింపడమే కాకుండా, మంచిగా బౌలింగ్ చేస్తున్న చాహాల్‌తో 4 ఓవర్ల కోటా పూర్తిచేయించకపోవడం వంటివి విరాట్ కోహ్లీ చెత్త కెప్టెన్సీకి నిదర్శనమంటున్నారు ఫ్యాన్స్...
undefined
విరాట్ కోహ్లీ స్థానంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్‌ను సారథిగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆర్‌సీబీ ఫ్యాన్స్...
undefined
బట్లర్‌ను కెప్టెన్‌ చేయాలంటూ కొత్త వాదన తెరపైకి లేపాడు క్రికెట్ వ్యాఖ్యత హార్షా బోగ్లే...
undefined
ఈ సీజన్‌లో కేవలం మూడే విజయాలు అందుకుంది రాజస్థాన్ రాయల్స్... సారథిగా స్టీవ్ స్మిత్ కూడా వరుసగా ఫెయిల్ అవుతున్నాడు.
undefined
దాంతో జోస్ బట్లర్‌ను రాజస్తాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా చేయబోతున్నారంటూ ట్వీట్ చేశాడు హర్షా బోగ్లే...
undefined
అయితే ఆ వార్తలో నూరు శాతం నిజం లేదని తెలిసి, దాన్ని డిలీట్ చేస్తున్నాడు మరో ట్వీట్ చేశాడు హర్షా బోగ్లే...
undefined
స్మిత్ కెప్టెన్సీపై నమ్మకం లేదని బట్లర్ జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలని ఉందని అభిమానులు కెప్టెన్సీ మార్పును డిమాండ్ చేస్తున్నారు.
undefined
click me!