కెఎల్ రాహుల్‌కి నిజంగా గాయమైందా? కావాలని తప్పించారా... సిరీస్‌ ఆరంభానికి ఒక్క రోజు ముందు...

Published : Jun 09, 2022, 04:30 PM IST

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా కాస్తో కూస్తో మెప్పించిన కెఎల్ రాహుల్, స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికా టూర్‌లో కెప్టెన్‌గా అట్టర్ ఫ్లాప్ అయిన కెఎల్ రాహుల్‌కి తిరిగి సారథ్య బాధ్యతలు అప్పగించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే సిరీస్ ఆరంభానికి ముందు ఒక్క రోజు ముందు... కెఎల్ రాహుల్ గాయంతో తప్పుకోవడం హాట్ టాపిక్‌గా మారింది...

PREV
18
కెఎల్ రాహుల్‌కి నిజంగా గాయమైందా? కావాలని తప్పించారా... సిరీస్‌ ఆరంభానికి ఒక్క రోజు ముందు...
Image Credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నోసూపర్ జెయింట్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, 15 మ్యాచుల్లో 51.33 సగటుతో 616 పరుగులు చేశాడు. వరుసగా మూడో సీజన్‌లో 600+ పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

28

సౌతాఫ్రికాలో రెండో టెస్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, జోహన్‌బర్గ్‌లో టీమిండియాకి మొట్టమొదటి ఓటమి రుచి చూపించాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో సెంచూరియన్‌లో భారీ విజయం తర్వాత ఇలాంటి పరాజయం రావడం టీమిండియా పర్ఫామెన్స్‌పై తీవ్రంగా ప్రభావం చూపింది...

38

వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ గాయంతో టూర్‌కే రాకపోవడంతో అతని స్థానంలో వన్డే సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు కెఎల్ రాహుల్. శిఖర్ దావన్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా వంటి సీనియర్లు అందరూ అందుబాటులో ఉన్నా... సఫారీ గడ్డపై ఒక్క వన్డే కూడా గెలవలేకపోయింది రాహుట్ టీమ్...

48
KL Rahul

ఈ సిరీస్ రిజల్ట్‌తో కెఎల్ రాహుల్‌ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘వాడిలో ఏ కోణంలో కెప్టెన్సీ లక్షణాలు కనిపిస్తున్నాయ్...’ అంటూ ఓ బీసీసీఐ అధికారి బాహాటంగానే కామెంట్ చేశాడు. అయినా తీరు మార్చుకోని సెలక్టర్లు, స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్‌కి కెఎల్ రాహుల్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేశారు...

58
KL Rahul-Gautam Gambhir

అయితే సిరీస్ ఆరంభానికి ఒక్క రోజు కెఎల్ రాహుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ సీజన్ మొత్తం బాగా ఆడిన కెఎల్ రాహుల్, ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన తర్వాత లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్ ఆగ్రహానికి గురై గాయపడి ఉంటాడని కొన్ని మీమ్స్... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

68

మొత్తానికి గాయం కారణంగా కెఎల్ రాహుల్ తప్పుకోవడంతో వరుసగా 13 టీ20 మ్యాచులు గెలిచిన జట్టుగా నిలిచే అవకాశం టీమిండియా ముందు నిలిచిందని... అతను కెప్టెన్‌గా ఉండి ఉంటే కచ్ఛితంగా అది వీలయ్యే ఛాన్స్ కాదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు...

78
K L Rahul

ఇప్పటికే రోహిత్ శర్మ గాయాలు, విశ్రాంతి పేరుతో సగం సిరీస్‌లకు అందుబాటులో ఉండడం లేదని, టీమిండియా తర్వాతి కెప్టెన్‌గా కెఎల్ రాహుల్‌ని నియమిస్తే కూడా అదే పరిస్థితి వస్తుందని... ప్రతీ రెండు సిరీస్‌లకి ఓసారి కెప్టెన్‌ని మారుస్తూ ఉండాల్సి వస్తుందని ట్రోల్ చేస్తున్నారు భారత అభిమానులు...

88

ప్లేయర్లను పక్కనబెట్టడానికి ఇప్పుడు టీమిండియా వాడుతున్న సాకు గాయం... ఇంతకుముందు సిరీస్‌లలో కూడా అజింకా రహానే, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లను మ్యాచ్ ఆరంభానికి ముందు గాయం వంకతో పక్కనబెట్టారు. ఇప్పుడు కెఎల్ రాహుల్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించడానికి కూడా ఇదే అస్త్రాన్ని వాడి ఉంటుందని అని భావిస్తున్నారు ఇంకొంతమంది విశ్లేషకులు...

Read more Photos on
click me!

Recommended Stories