INDvsAUS: టీమిండియా జెర్సీపై రంగు పడింది... ఆస్ట్రేలియా సిరీస్‌లో విరాట్ సేన న్యూలుక్!

First Published Nov 12, 2020, 10:53 AM IST

IPL 2020 సీజన్‌ను విజయవంతంగా ముగించిన బీసీసీఐ, ఆ వెంటనే ఆస్ట్రేలియా టూర్ ఖరారు చేసింది. నవంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే సుదీర్ఘ సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లనుంది భారత జట్టు. బయోబబుల్‌లో జరిగే ఈ టూర్‌లో కొత్త జెర్సీలో మెరగబోతున్నట్టు కనిపిస్తోంది భారత క్రికెట్ జట్టు.

ఇప్పటికే భారత్‌తో జరిగే సిరీస్ కోసం కొత్త జెర్సీని విడుదల చేసింది ఆస్ట్రేలియా జట్టు. ముగ్గుల డిజైన్‌తో కనిపిస్తున్న ఆసీస్ జెర్సీ... చూడడానికి కాస్త కొత్తగా, కాస్త వింతగా అనిపిస్తోంది.
undefined
ఆస్ట్రేలియాతో జరిగే టీ20, వన్డే సిరీస్‌లో కొత్త టీమిండియా న్యూలుక్‌ని విడుదల చేసింది భారత క్రికెట్ నియంత్రణ సంస్థ.
undefined
సచిన్ కెప్టెన్సీలో టీమిండియా ఆడినప్పుడు ధరించిన జెర్సీలా కనిపిస్తోంది విరాట్ సేన న్యూజెర్సీ... డార్క్ బ్లూ కలర్ జెర్సీలో టీమిండియా మెరవబోతోంది.
undefined
ఆసీస్ టూర్‌కి బయలుదేరిన భారత క్రికెట్ బృందం... ఈ జెర్సీని ధరించి.. పైన పీఈఈ కిట్లను వేసుకుంది.
undefined
కొత్త జెర్సీకి సంబంధించిన లుక్‌ను త్వరలో అధికారికంగా విడుదల చేయబోతున్నారు. అప్పటిదాకా టీమిండియా న్యూలుక్‌ కనిపించకుండా ఇలా కవర్ చేసింది విరాట్ సేన.
undefined
నైక్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ముగియడంతో టీమిండియా కొత్త స్పాన్సర్‌గా ఆన్‌లైన్ గేమింగ్ సంస్థ ఎమ్‌పీఎల్ వ్యవహారించబోతోంది.
undefined
మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎమ్‌పీఎల్‌)తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొత్త జెర్సీలో మెరవబోతోంది భారత క్రికెట్ జట్టు...
undefined
కరోనా బ్రేక్ తర్వాత మళ్లీ క్రికెట్ సీజన్ ప్రారంభించనున్న భారత జట్టుతో పాటు టీమిండియాతో సిరీస్‌‌ కోసం ఆసీస్ కూడా కొత్త జెర్సీలో కనిపించబోతున్నారు...
undefined
ఆస్ట్రేలియా సిరీస్‌లో టెస్టులకు ఎంపికైన ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ... కొత్త జెర్సీలో కనిపించడానికి చాలా సమయం పడుతుంది...
undefined
మొదటి టెస్టు తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి వస్తుండడంతో మిగిలిన మూడు టెస్టుల్లో అజింకా రహానే లేదా రోహిత్ శర్మ సారథ్యంలో ఆడనుంది భారత జట్టు.
undefined
click me!