వాళ్ల కంటే వీళ్లే బాగా ఆడుతున్నారు... టీమిండియా కంటే అదరగొడుతున్న ఇండియా లెజెండ్స్...

First Published Mar 18, 2021, 4:04 PM IST

కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడంతో టీమిండియా అదరగొడుతోంది... కానీ ఇండియా లెజెండ్స్ ఆటతో పోలిస్తే విరాట్ సేన ఆటకి సగం మార్కులు కూడా పడవేమో... రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ చూస్తున్నవాళ్లంతా ఇదే ఫీల్ అవుతున్నారు...

సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, వినయ్ కుమార్... ఒకప్పుడు టీమిండియాలో స్టార్లుగా ఎదిగినవాళ్లు. వీరిలో ఒక్క సచిన్ టెండూల్కర్‌కి మినహా ఇస్తే మిగిలిన ఎవ్వరికీ సరైన వీడ్కోలు దొరకలేదు...
undefined
టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు, వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ బాదిన వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్ అయితే జట్టులో చోటు కోసం ఆశగా ఎదురుచూస్తూ, నిరాశతో రిటైర్మెంట్ ప్రకటించాడు. యువరాజ్, పఠాన్ సోదరులదీ అదే పరిస్థితి...
undefined
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో వీరంతా అదరగొడుతున్నారు. కెప్టెన్‌గా సరైన రికార్డు లేని సచిన్ టెండూల్కర్ నాయకత్వంలో దుమ్మురేపుతూ ఫైనల్‌కి చేరుకుంది ఇండియా లెజెండ్స్ జట్టు...
undefined
వెస్టిండీస్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ అయితే క్రికెట్ అభిమానులకు కావాల్సినంత మజాని అందించింది. సచిన్ టెండూల్కర్ 42 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 65, యువరాజ్ సింగ్ 20 బంతుల్లో ఓ ఫోర్, 6 సిక్సర్లతో 49 పరుగులు చేశారు.
undefined
యూసఫ్ పఠాన్ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37, వీరేంద్ర సెహ్వాగ్ 17 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 219 పరుగుల భారీ స్కోరు చేసింది ఇండియా లెజెండ్స్...
undefined
విరాట్ కోహ్లీ సారథ్యంలో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా వంటి యువ హిట్టర్లున్న టీమిండియా, మొక్కి మొక్కి 160 పరుగులు చేయడానికి కష్టపడుతుంటే... సగటున 40 ఏళ్లు పైబడిన సీనియర్లు మాత్రం చితక్కొడుతున్నారు...
undefined
విస్టిండీస్ మాజీ ప్లేయర్లు డ్వేన్ స్మిత్ 63, డియో నరైన్ 59, బ్రియాన్ లారా 46 పరుగులతో రాణించడంతో దాదాపు విజయాన్ని అందుకోనేలా కనిపించింది విండీస్ లెజెండ్స్. అయితే ఆఖరి రెండు ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ 12 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
undefined
ఈ సిరీస్‌లో సచిన్,యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్‌ల హిట్టింగ్ చూస్తుంటే... కుర్రాళ్ల కంటే వీళ్ల బ్యాటింగ్‌ బాగుందని ఫీల్ అవుతున్నారు అభిమానులు. అవసరమైతే రూల్స్ మార్చి అయినా సరే వీళ్లని మళ్లీ టీమిండియాలోకి తెస్తే, జట్టు బాగుపడుతుందని కోరుకుంటున్నారు...
undefined
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఓ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నీయే కావచ్చు. ఇందులో ప్రత్యర్థులు కూడా వయసు పైబడిన, రిటైర్మెంట్ ప్రకటించిన వాళ్లే కావచ్చొ... కానీ ఎవ్వరూ కూడా ఏ మ్యాచ్‌నూ తేలిగ్గా తీసుకోవడం లేదు....
undefined
ఇంగ్లాండ్‌ లెజెండ్స్‌తోజరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ ఓడినా, భారీ లక్ష్యచేధనలో దగ్గరి దాకా వచ్చింది టీమిండియా. ఇర్ఫాన్ పఠాన్, గోనీ చూపించిన పోరాట ప్రతిమ అద్భుతం...
undefined
టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచులు ఇలాంటి కిక్‌ను ఇవ్వలేకపోతున్నాయి. రెండు మ్యాచుల్లో ఇంగ్లాండ్ వన్‌సైడ్ విక్టరీ కొట్టగా, రెండో మ్యాచ్‌లో టీమిండియా డామినేషన్ కనిపించింది..
undefined
ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్నింటిలో 100 శాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నారు. అందుకే ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ కంటే రోడ్ సేఫ్టీ సిరీస్‌కే ఎక్కువ ఆదరణ వస్తోందని సమాచారం...
undefined
click me!