'హార్దిక్-అక్షర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు..' భార‌త ఓట‌మిపై సూర్య కుమార్ కామెంట్స్

Published : Jan 29, 2025, 12:00 AM IST

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ రాజ్‌కోట్‌లో జ‌రిగింది. ఈ మ్యాచ్ లో భార‌త్ ఇంగ్లాండ్ బౌలింగ్ ముందు నిల‌బ‌డ‌లేక‌పోయింది.   

PREV
15
'హార్దిక్-అక్షర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు..' భార‌త ఓట‌మిపై సూర్య కుమార్ కామెంట్స్

Varun Chakravarthy: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భార‌త్ ను చిత్తుగా ఓడించింది ఇంగ్లాండ్ జ‌ట్టు. ప్రారంభంలో భార‌త్ పై చేయి సాధించిన‌ట్టు క‌నిపించినా మ్యాచ్ ముగిసే స‌రికి ఫ‌లితం పూర్తిగా మారిపోయింది. ఇంగ్లాండ్ బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ ను త‌మ‌వైపు లాక్కున్నారు. 

రాజ్ కోట్ లో జ‌రిగిన ఈ మ్యాచ్ లో భార‌త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడోసారి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్లు కోల్పోయి 171 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య‌ఛేద‌న‌లో భార‌త్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 145 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. దీంతో టీమిండియా 26 ప‌రుగులు తేడాతో ఓడిపోయింది.

25
Varun Chakravarthy

ఆరంభంలో ఇంగ్లాండ్ జోరు.. మ‌ధ్య‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి సైక్లోన్  

తొలుత‌ బ్యాటింగ్ కు  వచ్చిన వెంటనే ఇంగ్లిష్ బ్యాట్స్ మెన్ పై భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. అయితే, ఎప్పుడైతే వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్ చేయ‌డం మొద‌లుపెట్టాడో అప్ప‌టి నుంచి ఇంగ్లాండ్ ప‌త‌నం మొద‌లైంది.

రాజ్‌కోట్‌లో వరుణ్ చక్రవర్తి తన పంజా విప్పడంతో ఇంగ్లిష్ జట్టు పేకమేడలా కూలిపోయింది. వ‌రుణ్ చక్రవర్తి మ‌రోసారి త‌న కెరీర్ లో బెస్ట్ బౌలింగ్ గ‌ణాంకాలు న‌మోదుచేస్తూ 5 వికెట్లు తీసుకున్నాడు. 20 ఓవ‌ర్ల‌లో ఇంగ్లాండ్ జ‌ట్టు 171 ప‌రుగులు చేసింది. బెన్ డ‌కెట్ 51 ప‌రుగులు, లివింగ్ స్టోన్ 43 ప‌రుగులు, జోస్ బ‌ట్ల‌ర్ 24 ప‌రుగులు ఇన్నింగ్స్ ఆడారు.  

35

భార‌త్ ను దెబ్బ‌కొట్టిన ఇంగ్లాండ్ బౌల‌ర్లు 

172 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన భార‌త్ కు ఈ మ్యాచ్ లో ఆరంభం నుంచే ఎదురుదెబ్బ‌లు త‌గిలాయి. దీంతో ఈ మ్యాచ్ లో టీమిండియా ఓట‌మిని చ‌విచూసింది. రాజ్‌కోట్‌లో 26 పరుగుల తేడాతో భార‌త్ పై ఇంగ్లాండ్ గెలిచింది.

ప‌హార్దిక్ పాండ్యా 40 పరుగుల ఇన్నింగ్స్ ఆడినా జట్టును విజయతీరాలకు చేర్చడంలో విఫలమయ్యాడు. భార‌త్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 145 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. హార్దిక్ త‌ప్పా మిగ‌తా బ్యాట‌ర్లు ఎవ‌రూ పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేదు.

45

ఆరంభం నుంచే భార‌త్ పై దెబ్బ‌ప‌డింది

రాజ్‌కోట్‌లో ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు త్వ‌ర‌గానే పెవిలియన్‌కు చేరుకున్నారు. కెప్టెన్ సూర్య ఫ్లాప్ షో కొనసాగుతుండగా తిలక్ వర్మ బ్యాట్ కూడా సైలెంట్ గా కనిపించింది. హార్దిక్ పాండ్యా 40 పరుగులతో ఇన్నింగ్స్ ఆడినా జట్టును విజయతీరాలకు చేర్చలేక‌పోయాడు. దీవ‌తో ఈ మ్యాచ్‌లో భారత్ 26 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 

55

సూర్యకుమార్ యాదవ్ ఏమన్నారు? 

మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, 'రోజు తర్వాత కాస్త మంచు కురుస్తుందని అనుకున్నాను. హార్దిక్‌, అక్షర్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు మ్యాచ్‌ మా చేతుల్లోనే ఉందనుకుంటాను. అయితే, ఇంగ్లాండ్ బౌల‌ర్లు మ్యాచ్ ను లాక్కున్నారు. ఈ ఘనత ఆదిల్ రషీద్‌కి చెందుతుంది, అతను చాలా బాగా బౌలింగ్ చేశాడు. అందుకే అతను వరల్డ్ క్లాస్ బౌలర్. మ్యాచ్ ను స్పిన్న‌ర్లు ఎప్పుడైనా మ‌లుపుతిప్ప‌గ‌ల‌రు. అందుకే మా జట్టులో స్పిన్నర్లు కూడా ఉన్నారు. టీ20 మ్యాచ్‌ల నుంచి మనం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటాం' అని తెలిపాడు.

Read more Photos on
click me!

Recommended Stories