ICC WTC Final: టాస్ గెలిచిన కేన్ విలియంసన్... ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా...

First Published Jun 19, 2021, 2:37 PM IST

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఎట్టకేలకు ఆరంభమైంది. తొలి రోజు వర్షం కారణంగా రద్దు కావడంతో, రెండో రోజు టాస్ వేశారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు... భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.

నిన్న సాయంత్రం వర్షం తగ్గడం, మ్యాచ్ నిలిపివేస్తూ మ్యాచ్ రిఫరీ ప్రకటించిన తర్వాత ఎండ రావడం జరిగింది. దీంతో పిచ్ మీద ఉన్న పచ్చికను కూడా కత్తిరించారు... ఈ పిచ్ స్పిన్‌కి కూడా అనుకూలించే అవకాశం ఉంది.
undefined
ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సౌంతిప్టన్‌లో ఈ రోజు కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే లోకల్ టైమ్ ప్రకారం మధ్యాహ్నం తర్వాత వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో తొలి రెండు సెషన్లు ఎలాంటి అంతరాయం లేకుండా జరిగే అవకాశం ఉంది...
undefined
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడబోయే జట్టును ఒక రోజు ముందుగానే ప్రకటించింది భారత జట్టు. అయితే వర్షం కారణంగా తుది జట్టులో వ్యూహాత్మక మార్పులు జరిగే అవకాశం ఉందని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
undefined
దీంతో జడేజా బదులు మహ్మద్ సిరాజ్ తుదిజట్టులో వస్తాడని ప్రచారం కూడా జరిగింది. అయితే తాము ప్రకటించిన జట్టులో ఎలాంటి మార్పులు చేయబోమని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రకటించాడు.
undefined
న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్, డివాన్ కాన్వే, కేన్ విలియంసన్, బీజే వాట్లింగ్, రాస్ టేలర్, హెన్రీ నికోలస్, గ్రాండ్‌హోమ్, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, నీల్ వాగ్నర్, కేల్ జెమ్మీసన్,
undefined
భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా.
undefined
click me!