ఐసీసీ డికేడ్ అవార్డ్స్... టెస్టులకు విరాట్... వన్డే, టీ20లకు కెప్టెన్‌గా ధోనీ...

First Published Dec 27, 2020, 5:33 PM IST

ఐసీసీ 2011-2020 దశాబ్దానికి గాను బెస్ట్ వన్డే, టీ20, టెస్టు జట్లను ప్రకటించింది. అయితే ఈ మూడు ఫార్మాట్లలోనూ దశాబ్దపు బెస్ట్ ఎలెవన్ జట్లకు భారత క్రికెటర్లే కెప్టెన్లుగా ఎంపిక కావడం విశేషం. ఐసీసీ టీమ్ అవార్డుల్లో పాకిస్తాన్ ప్లేయర్లలో ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం విశేషం. మెన్స్ టీ20, మెన్స్ వన్డే, మెన్స్ టెస్టు జట్లను ప్రకటించిన ఐసీసీ, వుమెన్స్ టీ20, వుమెన్స్ వన్డే బెస్ట్ జట్లను ప్రకటించింది. మిగిలిన అవార్డులను రేపు ప్రకటించనున్నారు.

ఐసీసీ ప్రకటించిన బెస్ట్ ఎలెవన్ వన్డే, టీ20, టెస్టు జట్లలో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ‘కింగ్’ విరాట్ కోహ్లీ...
undefined
ఐసీసీ బెస్ట్ టెస్టు టీమ్ ఆఫ్ ది డికేడ్‌‌కి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు విరాట్ కోహ్లీ. శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార్ సంగర్కర టెస్టు టీమ్‌కి వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. కోహ్లీతో పాటు భారత స్పిన్నర్ అశ్విన్‌కి టెస్టు టీమ్‌లో చోటు దక్కింది.
undefined
ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది డికేడ్ ఇలా ఉంది: విరాట్ కోహ్లీ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెస్టర్ కుక్, డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్, కుమార సంగర్కర, బెన్ స్టోక్స్, రవిచంద్రన్ అశ్విన్, డేల్ స్టెయిన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్.
undefined
ఐసీసీ దశాబ్దపు ఉత్తమ పురుషుల జట్టుకి మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ధోనీతో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు వన్డే జట్టులో చోటు దక్కింది.
undefined
ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది డికేడ్: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, షకీల్ అల్ హసన్, బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, ఇమ్రాన్ తాహీర్, లసిత్ మలింగ
undefined
ఐసీసీ టీ20 బెస్ట్ టీమ్‌కి కూడా మహేంద్ర సింగ్ ధోనీయే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 జట్టులో టీమిండియా నుంచి ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు బుమ్రాకి కూడా చోటు దక్కింది.
undefined
ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది డికేడ్: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), క్రిస్‌గేల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కిరన్ పోలార్డ్, రషీద్ ఖాన్, బుమ్రా, లసిత్ మలింగ.
undefined
వుమెన్స్ టీ20 బెస్ట్ టీమ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, బౌలర్ పూనమ్ యాదవ్‌కి చోటు దక్కింది...ఆసీస్ కెప్టెన్ మెన్ లానింగ్‌ మహిళల జట్టుకి కెప్టెన్‌గా ఎంపికైంది.
undefined
ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది డికేడ్: ఆలీసా హేలీ(వికెట్ కీపర్), మెగ్ లానింగ్ (కెప్టెన్), సోఫీ డివైన్, సూజీ బేట్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్టాఫీనీ టేలర్, డియాండ్రా డాటిన్, ఎల్లీసీ పెర్రీ, అన్యా స్రూబ్‌సోల్, మెగన్ స్కూట్, పూనమ్ యాదవ్
undefined
మహిళల వన్డే జట్టులో భారత కెప్టెన్ మిథాలీ రాజ్, సీనియర్ పేసర్ జులన్ గోస్వామికి చోటు దక్కింది. టీ20 టీమ్‌తో పాటు వన్డే టీమ్‌కి కూడా కెప్టెన్‌గా ఎంపికైంది ఆసీస్ సారథి మెగ్ లానింగ్.
undefined
ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది డికేడ్: ఆలీసా హేలీ, సూజీ బేట్స్, మిథాలీ రాజ్, మెగ్ లానింగ్ (కెప్టెన్), స్టోఫానీ టేలర్, సారా టేలర్ (వికెట్ కీపర్), ఎల్లీసీ పెర్రీ, డేన్ వాన్ నీకెర్క్, మారిజన్నే క్యాప్, జులన్ గోస్వామి, అనీసా మహ్మద్
undefined
వుమెన్స్ అసోసియేట్ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్‌గా స్కాట్లాండ్ ప్లేయర్ క్యాథరిన్ బ్రేస్‌ ఎంపికైంది. 50 సగటుతో బ్యాటింగ్‌లో రాణించిన క్యాథరిన్, 9.93 సగటుతో బౌలింగ్‌లోనూ అదరగొట్టింది.
undefined
మెన్స్ అసోసియేట్ ప్లేయర్ ఆఫ్ ది డకేడ్ అవార్డు కూడా స్కాట్లాండ్‌కే దక్కింది. స్కాట్లాండ్ ప్లేయర్ కేల్ కోటీజర్ ఈ అవార్డు అందుకోనున్నాడు. 45.54 సగటుతో 2277 పరుగులు చేశాడు కోటీజర్.
undefined
click me!