సచిన్ టెండూల్కర్‌ ఆటను చూస్తూ... ఇప్పుడైతేనా రెట్టింపు పరుగులు చేసేవాడిని.. - వీరేంద్ర సెహ్వాగ్...

First Published Jun 10, 2021, 12:35 PM IST

భారత జట్టుకి లభించిన అతి గొప్ప ఓపెనర్లలో వీరేంద్ర సెహ్వాగ్ ఒకడు. టెస్టుల్లో రెండు త్రిబుల్ సెంచరీలతో పాటు టెస్టుల్లో ధనాధన్‌ ఆటను పరిచయం చేసిన వీరూకి క్రికెట్ చివర్లో తగిన గౌరవం దక్కలేదు. ఆ విషయం పక్కనబెడితే తాజాగా సచిన్ టెండూల్కర్ నుంచి తాను నేర్చుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి చెప్పుకొచ్చాడు వీరూ.

సచిన్ టెండూల్కర్ తర్వాత ప్రత్యర్థులను ఆ రేంజ్‌లో వణికించిన భారత బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్. వీరూ క్రీజులో ఉంటే చాలు, బౌండరీల మోత మోగాల్సిందే.
undefined
టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ నమోదుచేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్, ఆరు డబుల్ సెంచరీలతో పాటు వన్డేల్లో సచిన్ టెండూల్కర్ తర్వాత డబుల్ సెంచరీ బాదిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
undefined
టీమిండియా తరుపున 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20 మ్యాచులు ఆడిన వీరూ... 2007 టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొన్న సీనియర్ ప్లేయర్లలో ఒకడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీరూ... తన క్రికెట్ కెరీర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టారు..
undefined
‘అందరిలాగే నేను కూడా చిన్నప్పుడు సచిన్ టెండూల్కర్ ఆటను టీవీల్లో చూసి, క్రికెటర్ అవ్వాలని ఇన్‌స్పైర్ అయినవాడిని. సచిన్ ఆడుతుంటే, ఎవ్వరైనా అలా టీవీలకు అతుక్కుపోయి చూడాల్సిందే...
undefined
నాకు బాగా గుర్తు. 1992 వన్డే వరల్డ్‌కప్‌ నుంచి నేను టీవీలో క్రికెట్ చూడడం మొదలెట్టా. సచిన్ టెండూల్కర్ కవర్‌ డ్రైవ్, స్ట్రైయిట్ డ్రైవ్ ఆడుతుంటే, నేను అలాగే ఆడాలని ప్రాక్టీస్ చేసేవాడిని... ఓ రకంగా చెప్పాలంటే నేను సచిన్‌కి ఏకలవ్య శిష్యుడిని...
undefined
ఇప్పుడంటే యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు, గేమ్‌లు, యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అప్పుడు టీవీల్లో క్రికెట్ చూడడమే చాలా పెద్ద విషయం. ఇప్పుడున్న అవకాశాలన్నీ ఉండి ఉంటే, మేం ఇంతకు రెట్టింపు పరుగులు చేసేవాళ్లం...
undefined
ఇన్ని సౌకర్యాలు ఉండి ఉంటే నేను కచ్ఛితంగా భారత జట్టుకి చాలా త్వరగానే ఎంపిక అయ్యేవాడిని... నా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామంది నా ఫుట్‌వర్క్ బాగోలేదని, దాన్ని మెరుగుపర్చుకోవాలని చెప్పేవాళ్లు.
undefined
అయితే ఫుట్‌వర్క్ ఎలా మార్చుకోవాలనేది మాత్రం ఎవ్వరూ చెప్పలేదు. మాజీ క్రికెటర్లు మన్సూర్ ఆలీ ఖాన్, గవాస్కర్, క్రిష్ శ్రీకాంత్ నాకు ఎంతగానో సాయం చేశారు. వారి నుంచే ఫుట్‌వర్క్ ఎలా ఉండాలనేది నేర్చుకున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్.
undefined
2007, 2011 వరల్డ్‌కప్స్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్... ఐపీఎల్‌లో 96 మ్యాచులు ఆడి 2629 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...
undefined
2013లో ఆస్ట్రేలియాపై చివరిగా అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ ఆడిన వీరేంద్ర సెహ్వాగ్, రెండేళ్ల పాటు జట్టులో చోటు కోసం ఎదురుచూశాడు. అయితే ఎంతకీ అవకాశం రాకపోవడంతో 2015లో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు వీరూ...
undefined
click me!